hyderabadupdates.com Gallery టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌ post thumbnail image

లాహోర్ : ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి భార‌త్, శ్రీ‌లంక దేశాలు. ఈ సంద‌ర్బంగా భార‌త్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఈ త‌రుణంలో తాము భ‌ద్రతా కార‌ణాల రీత్యా ఆడ‌టం లేదంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). ఆ బోర్డుకు మ‌ద్ద‌తుగా పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఈమేర‌కు భారీ ఎత్తున న‌ష్ట పోయే ఛాన్స్ ఉంద‌ని ఇప్ప‌టికే ఆ దేశం గుర్తించింది. మ‌రో వైపు పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు ఇంకా కొంత స‌మ‌యం కావాల‌ని అన్నారు.
ఇప్ప‌టికే ఐసీసీ టీ20 టోర్న‌మెంట్ లో పాల్గొనలా లేదా వ‌ద్దా అనే దానిపై అనుమ‌తి ఇవ్వాల్సింది పాకిస్తాన్ దేశ అధ్య‌క్షుడ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా చెప్పారు. దీంతో పాకిస్తాన్ ఎంట్రీపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. మ‌రో వైపు పాకిస్తాన్ ఈ టోర్నీ త‌ర్వాత కొలంబోకు వెళ్లాల్సి ఉంది. శ్రీ‌లంక‌తో జ‌రిగే సీరీస్ లో పాల్గొనాల్సి ఉంద‌న్నారు న‌ఖ్వీ. ఇదిలా ఉండ‌గా టెలికాస్ట్ స్పాన్స‌ర్షిప్ న‌కు సంబంధించి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. తాము దాదాపు రూ. 354 కోట్లు న‌ష్ట పోతున్నామ‌ని, ఇందుకు గాను త‌మ‌కు చెల్లించాల‌ని కోరుతున్నాయి ఆయా కంపెనీలు. మ‌రో వైపు బంగ్లాదేశ్ జ‌ట్టుకు బ‌దులు మ‌రో జ‌ట్టుకు ఛాన్స్ ఇచ్చింది ఐసీసీ. దీంతో అటు బంగ్లా ఇటు పాకిస్తాన్ ల‌కు ఝల‌క్ ఇచ్చింది.
The post టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంక్రాంతి పండుగ వేళ ప్ర‌త్యేక రైళ్లుసంక్రాంతి పండుగ వేళ ప్ర‌త్యేక రైళ్లు

హైద‌రాబాద్ : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇక్క‌డ ఉన్న వారంతా జ‌ర్నీ చేస్తారు. ఇప్ప‌టికే ఆర్టీసీ సంస్థ భారీ ఎత్తున బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. అయితే

నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. రిషబ్ శెట్టి హీరోగా, అలాగే దర్శకుడిగానూ తెరకెక్కించిన ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివోషనల్

Konda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీKonda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీ

Konda Surekha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వెళ్లారు. పీసీసీ