hyderabadupdates.com Gallery టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం post thumbnail image

అహ్మ‌దాబాద్ : భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ , కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి. ఇది ఎవ‌రూ ఊహించని విజ‌యం అన్నాడు. ఇలాంటి అరుదైన క్ష‌ణాల గురించి చెప్పేందుకు మాట‌లు రావ‌డం లేద‌న్నాడు. గంభీర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో భార‌త్ సూప‌ర్ షో చేసింద‌న్నాడు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఆడార‌ని, ఇక సంజు శాంస‌న్ , బుమ్రా గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు ర‌విశాస్త్రి. ఇదిలా ఉండ‌గా భారతదేశం 28 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికి 2011 ODI ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పుడు శాస్త్రి కామెంటేట‌ర్ బాక్స్ లో కూర్చున్నాడు. 15 సంవత్సరాల క్రితం శ్రీలంకపై జరిగిన ఫైనల్లో మాజీ కెప్టెన్ విజయ సిక్స్ కొట్టినప్పుడు ఆయన చేసిన “ఎంఎస్ ధోని స్టైల్‌గా ముగించాడు” అనే వ్యాఖ్య ఇప్పటికీ అభిమానుల మనస్సుల్లో తాజాగా ఉంది.
కానీ, అహ్మదాబాద్‌లో జరిగిన 2026 T20 ప్రపంచ కప్‌ను భారతదేశం గెలుచు కున్నప్పుడు, శాస్త్రి తన వ్యాఖ్యానంతో అందరినీ నిరాశ పరిచాడన్న విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. దానిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేశాడు. జ‌ట్టు క‌లిసిక‌ట్టుగా ఆడింద‌ని, ఇంత‌కంటే ఇంకేం కావాల‌ని పేర్కొన్నాడు. ఇక రికార్డు స్తాయిలో భార‌త్ మూడుసార్లు వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకోవ‌డం విశేషం. ఫాస్ట్ బౌలింగ్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు కూల్చాడు. కీవీస్ ప‌త‌నాన్ని శాసించాడు. గత మూడు సంవత్సరాలలో రోహిత్ శర్మ నాయ‌క‌త్వంలో, కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో భారతదేశం మూడు ICC టైటిళ్లను గెలుచుకుంది.
The post టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

భారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలిభారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలి

అమ‌రావ‌తి : భార‌త దేశం ఔన్న‌త్యాన్ని, రాజ్యాంగానికి ఉన్న విలువల‌ను ప్ర‌త్యేకంగా విద్యార్థుల‌కు తెలియ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్సీ , ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కొణిద‌ల‌. 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సోమ‌వారం ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ క్యాంపు

కాంట్రాక్టుల కోస‌మే బీజేపీలో చేరిన సీఎం రమేష్కాంట్రాక్టుల కోస‌మే బీజేపీలో చేరిన సీఎం రమేష్

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను ఏకి పారేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం అమ‌రావ‌తిని రాజ‌ధాని చేస్తున్నారో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఎం రమేష్

డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్

అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు