hyderabadupdates.com movies టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అంబటి ఇంటిపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త దాడి చేయించారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఆ క్రమంలోనే మాధవిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత రోజా విమర్శలు గుప్పించారు. అయితే, ఆ నేపథ్యంలో రోజా తనను బాడీ షేమింగ్ చేశారని గళ్లా మాధవి ఆరోపిస్తున్నారు. అయితే, రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేయబోనని ఆమె చెప్పారు.

వైసీపీ నేతలకు ఇలా బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కొత్త కాదని మాధవి అన్నారు. వాళ్లు బేసిగ్గా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. సబ్జెక్ట్ కు వారు పరిమితం కారని, అసలు విషయంపై ఏమీ మాట్లాడరని విమర్శించారు.

ప్రత్యర్థి పార్టీల నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే వైసీపీ నాయకుల లక్షణమని అన్నారు. అలా చేయడం వల్ల ఎదుటివారు సబ్జెక్ట్ గురించి సమాధానం చెప్పలేరని వారు భావిస్తుంటారని అన్నారు.

అప్పుడు తమ వాదన కరెక్ట్ అని ప్రజలు భావిస్తారన్నది వైసీపీ నేతల భావన అని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్…ఇలా అందరు నాయకులను రోజా ముందుగా బాడీ షేమింగ్ చేస్తారని అన్నారు. అదే మాదిరిగా తనపై కూడా రోజా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారని, కానీ, ఆ వ్యాఖ్యలపై స్పందించి తన స్థాయిని తాను తగ్గించకోబోనని మాధవి చెప్పారు.

వాళ్లకు వచ్చిన పదజాలాన్ని, భాషను వాడతారని, అంతకుమించి వారికి ఏమీ తెలీదని, వారిని ఇప్పుడు సంస్కరించలేమని చురకలంటించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కుల రాజకీయాలను తెరపైకి తెచ్చారని, లడ్డూ ఫ్లెక్సీలపై వివాదం రేపారని అన్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము ముందుకు పోతున్నామని, ఇటువంటి వ్యాఖ్యలపై, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఎజెండాలపై స్పందించి సమయం వృథా చేయబోమని మాధవి మరోసారి స్పష్టం చేశారు.

Related Post

గుజ‌రాత్‌లో మంత్రి వ‌ర్గ సంపూర్ణ ప్ర‌క్షాళ‌న‌: జ‌డేజా భార్య‌కు పీఠంగుజ‌రాత్‌లో మంత్రి వ‌ర్గ సంపూర్ణ ప్ర‌క్షాళ‌న‌: జ‌డేజా భార్య‌కు పీఠం

గుజ‌రాత్‌లో తొలిసారి బీజేపీ స‌ర్కారు మ‌ధ్యంత‌రంగా సంపూర్ణ మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేసింది. గ‌తంలో మంత్రులను ఒక‌రిద్ద‌రిని మార్చిన సంస్కృతి ఉంది. అదేస‌మ‌యంలో సంపూర్ణంగా ముఖ్య‌మంత్రితో పాటు అంద‌రినీ మార్చిన ప‌రిస్థితి కూడా ఉంది. కానీ, తొలిసారి ముఖ్య‌మంత్రిని అలానే ఉంచి..

శివాజీ జంటని ప్రేక్షకులు అంగీకరిస్తారాశివాజీ జంటని ప్రేక్షకులు అంగీకరిస్తారా

ఒకప్పుడు హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన నటుడు శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి చాలా సంవత్సరాలయ్యింది. చిరంజీవి ఇంద్ర, వెంకటేష్ తులసి నుంచే తన ప్రస్థానం మార్చుకున్నాడు. అలాని రెగ్యులర్ గా తెరమీద కనిపించలేదు కానీ కొంచెం గ్యాప్