hyderabadupdates.com Gallery టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా

టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా

టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా post thumbnail image

మంగళగిరి: ఇది టీడీపీ 3.O వర్షన్ అని , పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకు వెళ్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి నారా లోకేష్ స్ప‌ష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ లకు శిక్షణా తరగతుల్లో భాగంగా ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది అని అన్నారు. ఎంతోమంది గొప్ప నాయకులను తెలుగుదేశం పార్టీ తయారు చేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ప‌ని చేసిన కేసీఆర్ తెలుగుదేశం యూనివర్సిటీయేన‌ని, రెండో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం యూనివర్సిటీనే అని చెప్పారు నారా లోకేష్.
తెలుగుదేశం పార్టీ నాయకులను తయారుచేసే కార్ఖానా అని స్ప‌ష్టం చేశారు. గతంలో గండిపేటలో నిరంతరం పార్టీ శిక్షణ తరగతులు జరిగేవి. చాలా మంది ఉప ముఖ్యమంత్రులు అయినవారు ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. ఇప్పుడు ఏడాదిలో కనీసం 300 రోజులు పార్టీ శిక్షణ తరగతులు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం మీకు పదవులు ఇస్తున్నాం, కానీ ఏం చేయాలో చెప్పడం లేదు. చాలా మందికి వారి బాధ్యతలు ఏంటో తెలియవు. వేటి ఆధారంగా పార్టీ తమను గుర్తిస్తుందో చాలా మందికి తెలియద‌ని, అంందుకే ఈ శిక్షణ తరగతులను ద‌శ‌ల వారీగా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. దీని ద్వారా వారికి అవగాహన వస్తుందన్నారు.
The post టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Karpoori Thakur: బిహార్ ఎన్నికల బరిలో భారతరత్న మనవరాలుKarpoori Thakur: బిహార్ ఎన్నికల బరిలో భారతరత్న మనవరాలు

Karpoori Thakur : బిహార్‌ రాజకీయాల్లో కులం కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలోనూ కుల సమీకరణాలదే ముఖ్య భూమిక. ఈ పరిస్థితిని మార్చేందుకు కొన్ని దశాబ్దాల క్రితమే పోరాడిన నేత భారతరత్న కర్పూరీ ఠాకుర్‌. తన ఊరు పితౌంఝియాలో

Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్

    ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. మొకామా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్‌

Special Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణSpecial Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణ

    దేశవ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నుంచి శ్రీకారం చుట్టింది. 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో