hyderabadupdates.com Gallery టెక్నాల‌జీని ప్రోత్స‌హించాం ఐటీని అభివృద్ది చేశాం

టెక్నాల‌జీని ప్రోత్స‌హించాం ఐటీని అభివృద్ది చేశాం

టెక్నాల‌జీని ప్రోత్స‌హించాం ఐటీని అభివృద్ది చేశాం post thumbnail image

హైదరాబాద్ : నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు అని ఆలోచన చేసి టెక్నాలజీని ప్రోత్సహించి ఐటీని అందిపుచ్చుకున్నాం అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. హైద‌రాబాద్ లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై ప్ర‌స్తావించారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చారని చెప్పారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆర్ధిక సంస్కరణల్ని అందిపుచ్చు కోవ‌డం జ‌రిగింద‌ని అన్నారు సీఎం. ఐటీకి సూచికగా సైబర్ టవర్స్ నిర్మాణం చేశాం. ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని వెల్ల‌డించారు.
బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలను వదిలిపెట్టి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో అడుగు పెట్టిందన్నారు. ఈ క్రెడిట్ త‌న‌కే ద‌క్కింద‌న్నారు. తాను ముందే ఐటీకి ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, అది ఇప్పుడు ల‌క్ష‌లాది మందికి ఉపాధి ల‌భిస్తోంద‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. మూడు దశాబ్దాలుగా ఆ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్నారు. దీనిలో భాగంగానే ఐ.ఎస్.బీని కూడా అందుకునేలా చేశామ‌న్నారు సీఎం. ఓ అద్భుతమైన బిజినెస్ స్కూల్ గా ఐఎస్బీ పేరు తెచ్చుకుంద‌న్నారు. జీనోమ్ వ్యాలీ కూడా ఇలాగే వచ్చిందన్నారు. అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ ఫార్మా రంగంలోనూ నెంబర్ వన్ గా ఉన్నాయన్నారు.
The post టెక్నాల‌జీని ప్రోత్స‌హించాం ఐటీని అభివృద్ది చేశాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీవన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీ

దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం దావోస్ లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో పాల్గొని ప్ర‌సంగించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్‌ప్రెన్యూయర్ విధానంపై చ‌ర్చించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని తెచ్చి

AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వంAP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్‌ ఛార్ట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం (AP Government) కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా సంఘాల నుంచి

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎంతిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా