hyderabadupdates.com Gallery టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి

టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి

టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నూతన టెక్స్ టైల్స్ పాలసీని రూపకల్పన చేశారని మంత్రి చెప్పారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టే చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన పాలసీతో చేనేత రంగంలో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు. చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి చేనేత వస్త్రాల అమ్మకాలను పెంచామన్నారు ఎస్. స‌విత‌. ఈ కామర్స్ లోనూ చేనేత అమ్మకాలు చేస్తున్నామని, ఆన్ లైన్ సేల్స్ ద్వారా అమ్మకాలు మరింత పెరిగాయని తెలిపారు. గత ప్రభుత్వంలో నేతన్న భరోసా పథకం మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు.
ఈ పథకం అమలులో అర్హత లేని వైసీపీ కార్యకర్తలకు 40 వేల మందికి లబ్ధి చేకూర్చారని మంత్రి సవిత మండిపడ్డారు. దీనివల్ల ఆప్కోలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలు మరింత పెరిగేలా టాటా, తనేరియా, బిర్లా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు ఎస్. స‌విత‌. వస్త్రాల తయారీలో నేతన్నల స్కిల్ పెరిగేలా బాపట్ల, గుంటూరు, తూర్పు గోదావరి, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి వైసీపీ పాల‌న‌లో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కానీ తాము వ‌చ్చాక చేనేత రంగానికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు ఎస్. స‌విత‌.
The post టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జూన్ నెల శ్రీ‌వారి దర్శన కోటా విడుదల : టీటీడీజూన్ నెల శ్రీ‌వారి దర్శన కోటా విడుదల : టీటీడీ

తిరుమల : టీటీడీ శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. జూన్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటాను విడుద‌ల చేసింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు

ఆట‌గాళ్ల ఆట‌తీరుపై గౌతం గంభీర్ అసంతృప్తిఆట‌గాళ్ల ఆట‌తీరుపై గౌతం గంభీర్ అసంతృప్తి

చెన్నై : త‌మిళ‌నాడులో క్రికెట్ ఫీవ‌ర్ అలుముకుంది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది రాష్ట్ర రాజ‌ధాని చెన్నై లోని స్టేడియం. ఇదిలా ఉండ‌గా సూప‌ర్ -8లో భాగంగా భార‌త జ‌ట్టు జింబాబ్వేతో

భూ మాత‌ను ర‌క్షించాలి రైతుల ఆదాయం పెంచాలిభూ మాత‌ను ర‌క్షించాలి రైతుల ఆదాయం పెంచాలి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భూ మాతను రక్షించ‌డంపై దృష్టి సారించాల‌ని , రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని స్ప‌ష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు