hyderabadupdates.com movies ట్రెండింగ్ వీడియో: విజయ్.. రష్మిక.. ఒక క్యూట్ కిస్

ట్రెండింగ్ వీడియో: విజయ్.. రష్మిక.. ఒక క్యూట్ కిస్

విజయ్ దేవరకొండకు తెర మీద ముద్దులు కొత్తేమీ కాదు. రష్మిక మందన్నా కూడా కొన్ని చిత్రాల్లో లిప్ లాక్స్ చేసింది. వీళ్లిద్దరి మధ్య కూడా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో ముద్దులు చూడొచ్చు. కానీ వాటిని మించి ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ ఇద్దరి మధ్య ఒక క్యూట్ కిస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్మిక ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. 

అనుకున్నట్లే ఈ వేడుకకు విజయ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అతను ఆడిటోరియంలోకి అడుగు పెట్టాక నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు అందరినీ కలిశాక రష్మిక దగ్గరికి వచ్చాడు. రాగానే ఆమెకు గట్టిగా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంతటితో ఆగిపోకుండా తన చేతి మీద ముద్దు పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేసింది.

విజయ్, రష్మిక కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. గత నెలలో వీళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరి వేళ్ల మీద ఉన్న ఉంగరాలు వీరి ఎంగేజ్మెంట్‌ను ధ్రువీకరించాయి. నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. 

ఈ సందర్భంగా ఒకరి గురించి ఒకరేం మాట్లాడతారు.. ఎలా వ్యవహరిస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇద్దరూ కలిసి కనిపించిన తొలి మూమెంట్లోనే రష్మికకు విజయ్ క్యూట్ కిస్ ఇవ్వడం అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఆపై రష్మిక స్టేజ్ మీద మాట్లాడుతూ.. విజయ్‌ని విజ్జు అని సంబోధించడం.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక విజయ్ దేవరకొండ ఉండాలనే స్టేట్మెంట్ ఇవ్వడం.. విజయ్ కూడా రష్మికను ఉద్దేశించి గొప్పగా మాట్లాడడం వీరి ప్రేమ బంధానికి సూచికగా నిలిచింది.

Related Post

కొండా దంప‌తుల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. చ‌ర్చ‌లు స‌మాప్తం!కొండా దంప‌తుల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. చ‌ర్చ‌లు స‌మాప్తం!

గ‌త కొన్నాళ్లుగా వివాదాల‌కు కేంద్రంగా మారిన వ్య‌వ‌హారాల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరిన నేప‌థ్యంలో దీపావ‌ళి వేళ ఆ కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి