hyderabadupdates.com movies ట్రెండ్ గమనించండి వరప్రసాద్ గారూ

ట్రెండ్ గమనించండి వరప్రసాద్ గారూ

రికార్డులను బద్దలు కొడుతున్న మన శంకరవరప్రసాద్ గారు మొదటి వారం గడవడం ఆలస్యం ఏకంగా మూడు వందల కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఎంత బ్లాక్ బస్టర్ అయినా సాధారణంగా సోమవారం ఆక్యుపెన్సీలు తగ్గడం సహజం.

అయితే వరప్రసాద్ గారుకి వచ్చింది యునానిమస్ ఎక్స్ ట్రాడినరి టాక్. ఏబిసి సెంటర్లు తేడా లేకుండా అన్ని చోట్ల భారీ నెంబర్లు నమోదయ్యాయి. కొన్ని చోట్ల ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు ఎగిరిపోయాయి. ఏడో రోజు అత్యధిక గ్రాస్ నమోదు చేసిన తొలి రీజనల్ మూవీగా మరో రికార్డు అందుకుంది. సో డ్రాప్ ఎక్కువగా ఉండకూడదు.

కానీ ఏపీలో చాలా చోట్ల జిఓ ప్రకారం పెంచిన రేట్లే ఉంచారు. బుధవారం దాకా ఇలాగే ఉండబోతున్నాయి. అంటే వీక్ డేస్ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటె బుకింగ్ ఛార్జ్ కాకుండా 302 రూపాయలు చెల్లించాలి. సింగల్ స్క్రీన్ లోనూ 218 రూపాయల దాకా ఉంది. ఇది సామాన్యులను దూరం చేసే ధర.

ఎలాగూ సెలవులు అయిపోయాయి కాబట్టి మండే నుంచే నార్మల్ రేట్లు పెట్టి ఉంటే వరప్రసాద్ జోరు కొంచెం కూడా తగ్గేది కాదు. కానీ అలా చేయకపోవడం వల్ల సిడెడ్ లాంటి ఏరియాల్లో అంకెలు కాస్త తగ్గాయి. తెలంగాణలో గరిష్టంగా ప్రభుత్వం అనుమతించిన ధరలు ఆల్రెడీ అమలులోకి తెచ్చేశారు.

అయితే డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన మరోలా ఉండొచ్చు. ఎలాగూ ఇంకో రెండు వారాల దాకా బలమైన కాంపిటీషన్ లేదు కాబట్టి వీలైనంత వరప్రసాద్ నుంచి రాబట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నారు కాబోలు. మూమెంట్ ఇలాగే కొనసాగితే నాలుగు వందల మార్కు అసాధ్యం కాదు. కాకపోతే డౌన్ అవుతున్న ట్రెండ్ ని నిలబెట్టే బాధ్యత టికెట్ రేట్ల మీద ఉంది.

అనగనగా ఒక రాజుకి  సైతం ఈ సమస్య ఉంది. 50, 75 రూపాయలు పెంపు తీసుకోవడం వల్ల ఇది కూడా ఆక్యుపెన్సీ డ్రాప్ చూస్తోంది. నిర్మాతలు వీలైనంత త్వరగా ఇలాంటివి గమనించి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా అవసరం.

Related Post

Vijay Deverakonda Unleashes a Fierce Mass Avatar in ‘Rowdy Janardhana’Vijay Deverakonda Unleashes a Fierce Mass Avatar in ‘Rowdy Janardhana’

Star hero Vijay Deverakonda is all set to thrill audiences with a powerful, raw, and completely mass-oriented role in his upcoming film Rowdy Janardhana. Mounted on a grand scale as

లెజెండరీ దర్శకుడికి… నిర్మాతలు లేరా?లెజెండరీ దర్శకుడికి… నిర్మాతలు లేరా?

తెలుగులో ఎందరో స్టార్, లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లందరిలో క్రియేటివ్ డైరెక్టర్ అని ట్యాగ్ తెచ్చుకున్నది మాత్రం ఒక్క కృష్ణవంశీ. రామ్ గోపాల్ వర్మ శిష్యరికంలో రాటుదేలి.. తొలి చిత్రం గులాబీతోనే గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న కృష్ణవంశీ.. తర్వాత నిన్నే