hyderabadupdates.com movies డార్లింగ్ క్రేజ్ ఇంకా తగ్గలేదే

డార్లింగ్ క్రేజ్ ఇంకా తగ్గలేదే

పదహారు సంవత్సరాల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ అంటే ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ ఎమోషన్. మాస్ ఫార్ములాకు దూరంగా ఒక హాయిగొలిపే రొమాంటిక్ లవ్ స్టోరీలో కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలన్స్ చేస్తూ దర్శకుడు కరుణాకరన్ అందించిన విధానం మూవీ లవర్స్ కు స్పెషల్ మెమరీగా నిలిచిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కు టాలీవుడ్ లో పేరు తీసుకొచ్చింది ఈ మూవీనే. తర్వాత టీవీ, ఓటిటి, హోమ్ వీడియోలో డార్లింగ్ కు దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు.

ఇన్నేళ్ల తర్వాత వచ్చే వారం ఏప్రిల్ 24 డార్లింగ్ ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ కానుంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక్క బుక్ మై షోలోనే సుమారు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఇంత దూకుడు మొన్న కొత్తగా విడుదలైన సినిమాలకే లేకపోవడం అసలు ట్విస్టు. రిలీజ్ కు అయిదు రోజుల ముందే ప్రభాస్ చూపిస్తున్న మేనియాకి ట్రేడ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తొలి రోజు రెండు కోట్ల దాకా వసూళ్లు నమోదయ్యే అవకాశాలను కొట్టి పారేయలేం.

ఇంతగా డార్లింగ్ కనెక్ట్ అయిపోవడానికి కారణాలు లేకపోలేదు. లవ్ స్టోరీస్ లో అప్పటిదాకా లేని ఒక కొత్త స్క్రీన్ ప్లేని ఇది పరిచయం చేసింది. ఇంటర్వెల్ ముందు వరకు ప్రభాస్ తో ఒక లవ్ స్టోరీ చెప్పించి తీరా విశ్రాంతి పడే టైంకి అదంతా తూచ్ విలన్ నుంచి తప్పించుకోవడానికి చెప్పిన అబద్దమని హీరోతో ట్విస్టు ఇప్పించడం ఓ రేంజ్ లో పేలింది. సెకండ్ హాఫ్ లో ప్రభాస్, కాజల్ అగర్వాల్ కెమిస్ట్రీ గురించి ఫ్యాన్స్ ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉంటారు.

ఇంకో విషయం మర్చిపోకూడదు. జనవరిలో ది రాజా సాబ్ చేసిన గాయం నుంచి కోలుకోవడానికి ప్రభాస్ అభిమానులకో మందు కావాలి. అది డార్లింగ్ రూపంలో ఫీలవుతున్నారు కాబోలు. అయినా ఆరంజ్ లాంటి డిజాస్టరే రీ రిలీజ్ లో అంత బ్రహ్మాండంగా ఆడినప్పుడు డార్లింగ్ కు ఇంత రెస్పాన్స్ రావడంలో ఆశ్చర్యం లేదనేది వాళ్ళ కామెంట్. ఇదంతా పక్కనపెడితే ఈ సినిమాలో కనిపించిన క్యూట్ ప్రభాస్ మళ్ళీ ఫౌజీలో ఏమైనా దర్శనం ఇస్తాడేమో హను రాఘవపూడినే అడగాలి.

Related Post

చంద్రబాబుకే మేధావి వర్గం మద్దతు.. కారణం ఏమిటి?చంద్రబాబుకే మేధావి వర్గం మద్దతు.. కారణం ఏమిటి?

రాష్ట్రంలోని మేధావి వర్గం అంతా కూడా సీఎం చంద్రబాబు వైపు నిలబడిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అనేకమంది మేధావులు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ఛానెల్లు, యూట్యూబ్ ద్వారా కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా

వందేమాత‌రాన్ని కూడా కాంగ్రెస్ అవ‌మానించింది: మోడీవందేమాత‌రాన్ని కూడా కాంగ్రెస్ అవ‌మానించింది: మోడీ

వందేమాత‌రం గీతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అవ‌మానించింద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విమ‌ర్శిం చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాత‌రం నినాదం కీల‌క భూమిక పోషించింద‌న్నారు. అదేవిధంగా జాతి ఐక్య‌త‌కు, సంఘీభావానికి వందేమాతరం ప్ర‌తీక‌గా నిలిచింద‌ని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ

Chiranjeevi’s MSG Storms Box Office, Crosses ₹261 Cr in Just 6 DaysChiranjeevi’s MSG Storms Box Office, Crosses ₹261 Cr in Just 6 Days

Megastar Chiranjeevi’s latest Sankranthi release Mana Shankara Vara Prasad Garu is creating history at the box office with an unstoppable run. The film has collected a massive ₹261 crore+ worldwide