hyderabadupdates.com movies డెకాయిట్ దోచుకోవాల్సింది ఇంకా ఉంది

డెకాయిట్ దోచుకోవాల్సింది ఇంకా ఉంది

మొన్న శుక్రవారం విడుదలైన డెకాయిట్ స్లో అండ్ స్టడీగా ఉంది. టాక్ డీసెంట్ గా ఉండటం, ప్రమోషన్లు జనాలకు చేరడం, నాని లాంటి స్టార్లు అండగా నిలవడం, వీటికి మించి అడివి శేష్ బ్రాండ్ మీద జనంలో ఏర్పడ్డ నమ్మకం వెరసి మిక్స్డ్ టాక్ దాటుకుని మరీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే బ్లాక్ బస్టర్ అనిపించుకోవడానికి ఇప్పుడున్న జోరు సరిపోవడం లేదు. నిర్మాత కోణంలో చూస్తే ఆడియో, ఓటిటి, డబ్బింగ్ రూపంలో పూర్తిగా సేఫ్ అయ్యారు కానీ ఇప్పుడు అసలు దృష్టి డిస్ట్రిబ్యూటర్ల మీద ఉంది.

ఎందుకంటే డెకాయిట్ కి బాక్సాఫీస్ దగ్గర ఓపెన్ గ్రౌండ్ ఉంది. పెద్దగా పోటీ లేదు. అంతకు ముందు వచ్చిన బైకర్, రాకాసలు దాదాపు ఫైనల్ రన్ కు దగ్గరలో ఉన్నాయి. కాంపిటీషన్ గా వచ్చిన డబ్బింగ్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగులో మొదటి ఆటకే చేతులు ఎత్తేసింది. బాలీవుడ్ నుంచి కొత్త రిలీజులు లేవు. అటు నార్త్ లోనూ డెకాయిట్ కి స్పేస్ దొరికింది. కాకపోతే దాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటేనే వ్యాపారంలో ఇన్వాల్వ్ అయిన ప్రతిఒక్కరు లాభాలతో బయట పడతారు.

సుమారు నలభై కోట్ల గ్రాస్ కు దగ్గరలో ఉన్న డెకాయిట్ థియేట్రికల్ గా రాబట్టాల్సింది ఇంకో ఇరవై కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ టాక్. చాలా ఏరియాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ స్వంతంగా విడుదల చేయడంతో సరైన నెంబర్లు బయటికి రావడం లేదు. పెట్టుబడి యాంగిల్ లో లాభాల్లో ఉన్నామని చెబుతున్నారు తప్పించి విడిగా థియేటర్ రిటర్న్స్ ఎంత వచ్చాయో వెల్లడి చేయడం లేదు. నిన్న సోమవారం చాలా చోట్ల డెకాయిట్ డ్రాప్స్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి.

సో ఫైనల్ గా ఇది హిట్టా కాదా అని తేల్చడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సెలవు రోజు రావడంతో అనూహ్యంగా మరో అడ్వాంటేజ్ దక్కడంతో డెకాయిట్ బుకింగ్స్ మరింత ఊపందుకున్నాయి. ఏదైనా సినిమా హిట్ అనిపించుకోవాలంటే వీక్ డేస్ లో కూడా బలంగా హోల్డ్ చేయాలి. కానీ డెకాయిట్ గ్రాఫ్ బిసి సెంటర్లలో అప్ అండ్ డౌన్ అవుతోంది. ఏప్రిల్ 17కి కూడా మాస్ కి చెప్పుకోదగ్గ ఆప్షన్ లేకపోవడం ఏమైనా వాడుకుంటుందేమో చూడాలి.

Related Post

అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?

డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే రిలీజ్ చేసేస్తున్నారు. 12 సినిమాకు అఫీషియల్ రిలీజ్ డేట్ కాగా.. 11న రాత్రి సెకండ్ షోతో ప్రిమియర్స్ మొదలవుతున్నాయి. ఆ షోలు

ఏడుగురు హీరోయిన్లతో క్రిష్ సాహసం ?ఏడుగురు హీరోయిన్లతో క్రిష్ సాహసం ?

గత ఏడాది అనుష్క ఘాటీ రూపంలో దర్శకుడు క్రిష్ చాలా చేదు అనుభవాన్ని ఎదురుకున్నారు. కనీసం యావరేజ్ అయినా ఊరట దక్కేది కానీ డిజాస్టర్ కావడంతో డిఫెండ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది చాలదు అన్నట్టు పాక్షికంగా డైరెక్ట్ చేసిన

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్ కమిన్స్, వెన్నునొప్పి కారణంగా వచ్చే ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం కష్టమే అని తెలుస్తోంది. దీంతో కమిన్స్ రాకుంటే ఆ ప్లేస్‌లో