hyderabadupdates.com movies తండ్రి భావోద్వేగం.. 20 కోట్ల మంది మనసుల్ని దోచేసింది

తండ్రి భావోద్వేగం.. 20 కోట్ల మంది మనసుల్ని దోచేసింది

సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. నిజాయితీగా ఉండే ఏ భావోద్వేగాన్ని అయినా ఆదరించి.. అభిమానించే తీరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది ద్వేషం కావొచ్చు.. ప్రేమ కావొచ్చు.

ఆ వ్యత్యాసాన్ని అంచనా వేసే విషయంలో జరిగే పొరపాట్లకు ఎందరో సెలబ్రిటీలు అప్పటివరకు హీరోలుగా ఉన్నోళ్లు జీరోలయ్యే పరిస్థితి. అందుకే.. సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని అలుసుగా తీసుకుంటే అడ్డంగా తొక్కేస్తుంది. ఎంత గౌరవం ఇవ్వాలో అంత ఇచ్చినప్పుడు మాత్రం ఆదరించి అభిమానిస్తుంది.

ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఒక తండ్రి  భావోద్వేగానికి 20 కోట్ల మంది ఫిదా కావటమే కాదు.. సదరు చిట్టి వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. నిజంగానే ఆ వీడియోలో అంత విశేషం ఏముందన్న ప్రశ్న వేసుకుంటే..కొందరికి సాదాసీదాగా అనిపించొచ్చు. మరికొందరు అంత కంగారు అవసరమా? అనుకోవచ్చు. కానీ.. ఆ తండ్రి నికార్సైన ప్రేమ కోట్లాది మంది మనసుల్ని దోచేసిందని చెప్పాలి.

బిడ్డకు జన్మనిచ్చే ప్రతి తల్లికి పునర్జన్మే.. అదే సమయంలో అప్పటివరకు భర్తగా చెలామణీ అయ్యే మగాడు.. ఒక్కసారిగా నాన్నగా మారే క్షణంతో తనను తాను పూర్తిగా మార్చేసుకుంటాడు. తన పిల్లల కోసం మరింత బుద్దిగా.. బాధ్యతగా ఉండేలా డిసైడ్ అవుతాడు. అప్పటివరకు తనకు అలవాటు లేని ఎన్నో అనుభూతులు అతనికి ఎదురవుతుంటాయి. అన్నింటికి మించి తొలిసారి లేబర్ రూం నుంచి అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకొచ్చి చూపించే క్షణంలో ఏ తండ్రి అయినా ఒక్కసారిగా తీవ్రమైన భావోద్వేగానికి గురవుతాడు.

సరిగ్గా అలాంటి క్షణాల్ని చెన్నైకు చెందిన డాక్టర్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నారు. ఇందులో లేబర్ రూం బయట వెయిట్ చేస్తున్న తండ్రికి.. ఇదిగో మీ బిడ్డ అంటూ.. బుజ్జాయిని తీసుకొచ్చిన వేళ.. ఆ బిడ్డను ఎలా ఎత్తుకోవాలన్నది అర్థం కాక.. కంగారులో ఆ తండ్రి ప్రదర్శించిన భయం.. దానికి మించిన ఆనందం.. అదే సమయంలో తన ఏదైనా తప్పు జరిగితే ఏమవుతుందో అన్న ఆందోళనకు గురి కావటం.. మరేం ఫర్లేదు.. మీ బిడ్డను ఇలా ఎత్తుకోవాలంటసదరు వైద్యురాలు సర్దిచెప్పిన వైనం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది.

తన కలల పంటను మొదటిసారి నేరుగా చూసిన ఆ తండ్రి పడిన భావోద్వేగానికి నెటిజన్లు విపరీతంగా కనెక్టు అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారటమే కాదు.. సదరు తండ్రి ప్రేమకు ప్రశంసల వర్షంకురుస్తోంది. తండ్రి ప్రేమకు ఇంతకు మించిన నిదర్శనం ఏమంటూ తమ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వీడియోను చూసేయండి.

View this post on Instagram

Related Post

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరాథియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు వారాల్లో ఇంటికే వస్తున్నప్పుడు వందలు వేలు ఖర్చు పెట్టుకుని టికెట్లు ఎందుకు కొనాలనే ధోరణి జనంలో బాగా పెరిగిపోయిందని పలువురు

Deepika PadukoneDeepika Padukone

Minutes to read: 5 minTeam IBO Rating User Rating [Total: 0 Average: 0] { “@context”:”http://schema.org”, “@type”:”WebPage”, “url”:”https://www.insideboxoffice.com/actors/salman-khan/”, “description”:”Abdul Rashid Salim Salman Khan is the most well-known Indian actor, and Bollywood