గ్లామర్ హీరోయిన్ రాశి ఖన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరంగా పంచుకుంది. తాను ఒకప్పుడు లావుగా ఉండేదానని, ఆ సమయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుందని చెప్పింది. చిన్నప్పటి నుంచే తాను తినడం చాలా ఇష్టపడేదని రాశి తెలిపింది. పరాఠాలు, వెన్న వంటి వంటకాలను తరచుగా తినడం వల్ల తన బరువు పెరిగిందని చెప్పింది. కానీ సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కెమెరా ముందు అందంగా కనిపించాల్సిన అవసరం ఉందని అర్థమైందని ఆమె తెలిపింది.
రాశి ఖన్నా చెప్పినట్లుగా, తన రూపం చూసుకున్నప్పుడు తాను తగ్గాలని నిర్ణయం తీసుకుందట. బరువు తగ్గడమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా తనకు ముఖ్యమైందని ఆమె అభిప్రాయపడింది. అందుకే జిమ్‌కు క్రమంగా వెళ్లడం మొదలుపెట్టిందని చెప్పింది. కాలక్రమంలో జిమ్ తన జీవితంలో విడదీయరాని భాగమైపోయిందని రాశి చెప్పింది.
The post తన డైట్ గురించి ఈ ముద్దుగుమ్మ ఏమందంటే..! appeared first on Telugumopo – Movies and Politics.