hyderabadupdates.com Gallery త‌ప్పు చేసిన వారికి శిక్ష త‌ప్ప‌దు : డిప్యూటీ సీఎం

త‌ప్పు చేసిన వారికి శిక్ష త‌ప్ప‌దు : డిప్యూటీ సీఎం

త‌ప్పు చేసిన వారికి శిక్ష త‌ప్ప‌దు : డిప్యూటీ సీఎం post thumbnail image

అమరావ‌తి : ప‌విత్ర‌మైన తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆనాటి జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. దేవాలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి పనన్నారు . 2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ పాలనలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయని వాపోయారు అన్నీ మతపరంగా సున్నితమైన అంశాలేన‌ని పేర్కొన్నారు. రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే ఎవరో ఆకతాయి చేశాడ‌ని త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలకు అశుద్దం పూస్తే అదీ పిచ్చోడి పనే అన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు చోరికీ గురై పోతే కొత్తది కొనుక్కోవచ్చంటూ తేలికగా మాట్లాడారు. అంతర్వేదిలో రథం తగులబెడితే అదీ ఎవరో పిచ్చోడి పనే అన్నారు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు 219కి పైగా జరిగాయని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఒక్క అంశంలోనూ సరైన చర్యలు తీసుకున్నది లేదన్నారు. ఇలాంటి అంశాల్లో ఏ రోజూ రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించ లేద‌ని చెప్పారు . శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత న‌క్స‌లైట్ల దాడుల్లో బ‌తికి బ‌య‌ట ప‌డిన చంద్ర‌బాబు నాయుడు సున్నిత అంశాల‌కు సంబంధించి చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడ‌తార‌ని అన్నారు. ఎన్నికల అనంతరం ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఆయన కల్తీ నెయ్యికి సంబంధించి నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్.డి.డి.బి) రిపోర్టును మా అందరికీ చదివి వినిపించారని తెలిపారు. ఒక రిపోర్టులో విజిటెబుల్ ఆయిల్స్ ఉన్నాయని ఉందన్నారు. వాళ్లు ఏ స్థాయిలో కల్తీకి పాల్పడ్డారని చెబుతూ అసలు ఆ ద్రావకంలో నెయ్యే లేదని, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్, పంది కొవ్వు లాంటివి ఉన్నాయని రిపోర్టులో ప్రస్తావించారని స్ప‌ష్టం చేశారు.
ఇది చాలా సున్నితమైన అంశం. ఈ అంశాన్ని బయటపెట్టే ముందు చాలా ఆలోచించాం. పర్యవసానాలు ఎలా ఉంటాయి అని ఆలోచించే ముందుకు వెళ్లాం. చెప్పక పోతే తెలిసీ ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడాం అనుకోవడానికి అప్పుడే అధికారంలోకి వచ్చాం. ఐదేళ్లు మేమే పాలనలో ఉంటాం. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాజకీయం చేయాల్సిన అవసరం మాకు ఏం ఉంటుందంటూ ప్ర‌శ్నించారు ప‌వ‌న్ కళ్యాణ్. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లపోతే మాదే తప్పు అవుతుందని మాత్రమే ఆలోచన చేశాం. హైందవ సంస్కృతిని అపవిత్రం చేసినప్పుడు మాట్లాడక పోవడం తప్పనిపించి గొంతు విప్పాం అన్నారు. వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. విచారణ జరపాలనుకున్నాం.
The post త‌ప్పు చేసిన వారికి శిక్ష త‌ప్ప‌దు : డిప్యూటీ సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌

    తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 28న కోవైలో

Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహంWedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం

    పచ్చని పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురిని మెట్టినింటికి పంపాల్సిన ఓ తండ్రి కాటికి చేరాడు. కూతురి పెళ్లి కోసం సరుకులు తీసుకురావడానికి వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో కూతురు పెళ్ళి కోసం

టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవోటీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో

తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవ‌లే ల‌డ్డూ క‌ల్లీ