hyderabadupdates.com movies తమిళం వద్దు.. కన్నడ ముద్దు

తమిళం వద్దు.. కన్నడ ముద్దు

భాషా భేదం లేకుండా ఎక్కడి సినిమాలనైనా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులకు పేరుంది. ఐతే చరిత్ర చూస్తే వాళ్లు అత్యధికంగా ఆదరించిన పరభాషా చిత్రాలు.. తమిళంవే. ఆ పరిశ్రమకు చెందిన రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య సహా పలు హీరోలను ఇక్కడి స్టార్లతో సమానంగా ఆదరించారు. వాళ్ల సినిమాలు ఇక్కడి చిత్రాలను డామినేట్ చేసిన సందర్భాలున్నాయి. ఐతే గత కొన్నేళ్లలో తమిళ సినిమాల పట్ల మన వాళ్లకు ఆసక్తి తగ్గిపోతోంది.

గత దశాబ్దంలో తమిళ చిత్రాల క్వాలిటీ పడిపోవడం వాస్తవం. ఈ మధ్య మరీ సబ్ స్టాండర్డ్ సినిమాలు వస్తున్నాయి అక్కడి నుంచి. కానీ అదే సమయంలో కన్నడ చిత్రాలకు తెలుగు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు కన్నడలో ఎక్కువగా తెలుగు, తమిళ రీమేక్‌లు తెరకెక్కేవి. అక్కడ రొటీన్ మాస్ మసాలా సినిమాలే తీసేవారు. మన సినిమాల ముందు అవి ఎంతమాత్రం నిలిచేవి కావు. కానీ గత కొన్నేళ్లలో కన్నడ చిత్రాల క్వాలిటీ ఎంతగానో పెరిగింది.

కేజీఎఫ్ కన్నడ సినిమాల్లో గేమ్ చేంజర్‌గా నిలిచింది. కన్నడ చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో ఆదరించడం ఆ చిత్రంతోనే మొదలైంది. ఆ తర్వాత కేజీఎఫ్-2, కాంతార, సప్త సాగరాలు దాటి, విక్రాంత్ రోణ.. ఇలా చాలా సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు దక్కించుకున్నాయి. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్-2’ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది.

ఫుల్ రన్లో వసూళ్లు రూ.120-130 కోట్ల మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా తెలుగులో అనువాద చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు కన్నడ సినిమా అయిన ‘కేజీఎఫ్-2’ పేరిటే ఉండడం విశేషం. ఇప్పుడు ‘కాంతార-2’ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ‘2.0’ కలెక్షన్లను ఈ చిత్రం అధిగమించింది. కన్నడ సినిమాలకు తెలుగులో ఇలాంటి వసూళ్లు వస్తాయని ఓ పదేళ్ల ముందు ఎవరైనా అంటే నవ్వుకునేవాళ్లమేమో. నార్త్ ఇండియాలో కూడా కన్నడ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడం విశేషం. నెమ్మదిగా తమిళ అనువాదాల స్థానాన్ని కన్నడ చిత్రాలు అధిగమిస్తున్న మాట వాస్తవం.

Related Post

కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌ల‌మిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌ల‌మిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు కూట‌మి అధికారంలో ఉండాల‌ని జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌లంగా చెబుతున్న విష‌యం తెలిసిందే. ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెప్ప‌డం ద్వారా వైసీపీని బ‌లంగా ఎదుర్కొనేందుకు కూట‌మిగా ఉండ‌డం ఒక్క‌టే కీల‌క మంత్ర‌మ‌న్న

రోహిత్ కోహ్లీ.. ఇద్దరికీ నెక్ట్స్ బిగ్ ఛాలెంజ్ ఇదే!రోహిత్ కోహ్లీ.. ఇద్దరికీ నెక్ట్స్ బిగ్ ఛాలెంజ్ ఇదే!

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ముగిసింది. భారత్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయినప్పటికీ, అభిమానులకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఫామ్‌లోకి రావడం పెద్ద ఊరట. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న ఈ సీనియర్ ప్లేయర్లు, తమ