hyderabadupdates.com movies తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజ‌మే..

తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజ‌మే..

వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ ఒక ట్వీట్ చేశారు. ‘ దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే ద్వేషం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు. ఉద్యోగాలు వ‌స్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు.. నిలువెల్లా స్వార్థం, మ‌న‌సంతా విధ్వంసంతో ర‌ప్పా ర‌ప్పా న‌రుకుతాం.. అమ‌రావ‌తిని మార్చేస్తాం.. క‌ట్టిన‌వ‌న్నీ కూల్చేస్తాం.. కంపెనీల‌న్నీ వెళ్ల‌గొడ‌తాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారూ!

దేశ రక్షణకు అధునాత‌న‌ బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగ‌తించాల్సింది పోయి, త‌రిమేస్తానంటారా? ఇదేం రాక్ష‌స మ‌న‌స్త‌త్వం? మత్స్యకారుల పిల్ల‌ల‌కు మెరుగైన వెయ్యికి పైగా ఉద్యోగాలు వ‌స్తాయంటే.. ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాన‌న‌డం ముమ్మాటీకీ సైకోయిజ‌మే..’ అని ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. 

ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం అంటూ వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ తీవ్రంగా ఖండించారు. మత్స్యకారులను జువ్వలదిన్నె నుంచి తరిమేయాలనుకుంటున్నారని జగన్ నిన్నటి కార్యక్రమంలో అన్నారు.

మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. జువ్వలదిన్నెకు చెందిన 79 ఎకరాల్లో సగం సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు కేటాయిస్తున్నాడు. వచ్చేది వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం. రాష్ట్రంలో ఉన్న అన్ని ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు.. అని జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

దేశ రక్షణకు అధునాత‌న‌ బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగ‌తించాల్సింది పోయి, త‌రిమేస్తానంటారా? అని ఆయన ప్రశ్నించారు.

Related Post