hyderabadupdates.com Gallery తెలంగాణ‌లో భారీ ఎత్తున ఐఏఎస్ ల బ‌దిలీలు

తెలంగాణ‌లో భారీ ఎత్తున ఐఏఎస్ ల బ‌దిలీలు

తెలంగాణ‌లో భారీ ఎత్తున ఐఏఎస్ ల బ‌దిలీలు post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పాల‌నా ప‌రంగా మ‌రింత ప‌ట్టు సాధించేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఎడా పెడా ఏఐఎస్ ల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగింది. 1995 బ్యాచ్ కు చెందిన సంజ‌య్ కుమార్ ను పరిశ్రమల శాఖ నుంచి పీఆర్ , ఆర్డీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. స‌వ్య‌సాచి ఘోష్ ను ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ , డెవలప్మెంట్ స్కీమ్స్ యూనిట్‌కు అదనపు బాధ్యతలు అప్ప‌జెప్పింది. ఎం. దాన కిషోర్ కు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మార్చేసింది. ఎన్ .శ్రీ‌ధ‌ర్ కు ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం చేసింది. రాహుల్ బొజ్జాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ (పాలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. ఇరిగేష‌న్ శాఖ కార్య‌ద‌ర్శిగా ఈ. శ్రీ‌ధ‌ర్ , ఫైనాన్స్ ,ప్లానింగ్ శాఖ సెక్ర‌ట‌రీగా గౌర‌వ్ ఉప్ప‌ల్ ను నియ‌మించింది.
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ గా ఉన్న విజ‌యేంద్ర ను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీగా బదిలీ చేసింది. మ‌హ‌బూబ్ బాద్ క‌లెక్ట‌ర్ గా ఉన్న అద్వైత్ కుమార్ సింగ్ ను న్యూఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ కు మార్చింది. యాదాద్రి భువ‌న‌గిరి క‌లెక్ట‌ర్ గా ఉన్న ఎం. హ‌నుమంత‌రావు ను ఎండోమెంట్స్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. నారాయ‌ణ‌పేట క‌లెక్ట‌ర్ గా ఉన్న సిక్తా ప‌ట్నాయ‌క్ ను ఫైనాన్స్ శాఖ స్పెష‌ల్ కార్య‌ద‌ర్శిగా బ‌దిలీ చేసింది. సందీప్ కుమార్ ఝా (2014) ను జనగాం కలెక్టర్‌గా నియమించింది. లేబ‌ర్ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ గా క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్ గా ఉన్న ప‌మేలా స‌త్ఫ‌తిని బ‌దిలీ చేసింది.
యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా క‌లెక్ట‌ర్ గా అనురాగ్ జ‌యంతి, మెద‌క్ క‌లెక్ట‌ర్ గా ఉన్న రాహుల్ రాజ్ పీఎస్ ను కోఆప‌రేటివ్ క‌మిష‌న‌ర్ గా నియ‌మించింది. టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ , ఎండీగా జితేష్ వి. ప‌టేల్ కు బ‌దిలీ చేసింది. జోగులాంబ గ‌ద్వాల జిల్లా క‌లెక్ట‌ర్ గా రిజ్వాన్ బాషా షేక్, ట్రైబ‌ల్ వెల్ఫేర్ డైరెక్ట‌ర్ గా సంతోష్ బి.ఎం, నారాయ‌ణ‌పేట జిల్లా క‌లెక్ట‌ర్ గా ప్ర‌తీక్ జైన్ , మ‌హ‌బూబాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ గా స్నేహ శ‌బ‌ర్ష్, క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ గా చిత్రా మిశ్రా, రాజ‌న్న సిరిసిల్ల క‌లెక్ట‌ర్ గా గ‌రిమా అగ్ర‌వాల్ , వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ గా దీప‌క్ తివారీ, మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ గా ప్ర‌తీమా సింగ్ , భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌లెక‌ట్ర్ గా అంకిత్ , హ‌న్మ‌కొండ జిల్లా క‌లెక్ట‌ర్ చ‌హ‌త్ బ‌జ్ పాయ్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఖుష్బు గుప్తా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా మంద మకరందు (2020)ను నియ‌మించింది. ఫైజాన్ అహ్మ‌ద్ ను మేడ్చ‌ల్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ గా, శివేంద్ర ప్ర‌తాప్ ను హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ ఎండీగా నియామకం చేసింది.
The post తెలంగాణ‌లో భారీ ఎత్తున ఐఏఎస్ ల బ‌దిలీలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

BRS: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధికి బిగ్‌ షాక్BRS: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధికి బిగ్‌ షాక్

BRS : జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి సునీత ఎంపికలో బిగ్‌ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ వారసుడిని తానేనంటూ తారక్‌ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. ఆ లేఖలో ‘తన

జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలిజాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి

న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు కేంద్రం త‌క్ష‌ణ‌మే నిధులు మంజూరు చేయాల‌ని కోరారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న కేంద్ర రోడ్లు, రవాణా , హైవే

ఏపీని హెచ్చ‌రించిన విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌ఏపీని హెచ్చ‌రించిన విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరక ముడియం, రాజాం, రేగడి ఆముదాల వలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలతో