హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రకటించిన మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. అధికారికంగా సర్కార్ ధ్రువీకరించింది. రాష్ట్రంలోని 7 నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. దీంతో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కార్పొరేషన్స్ , మున్సిపల్ కు సంబంధించి మొత్తం రాష్ట్రంలోని 52 లక్షల 42 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసిన అనంతరం రాణి కుముదిని మీడియాతో మాట్లాడారు.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 28వ తేదీ బుధవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 30 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ నామినేషన్లు వేయాల్సి ఉంటుందన్నారు. అదే రోజు అర్హత ఎవరు పొందారనే దానిపై జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర మంతటా నిర్దేశించిన ప్రాంతాలలో పోలింగ్ నిర్వహిస్తామన్నారు కమిషనర్. అయితే పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13వ తేదీన జరుగుతుందని తెలిపారు రాణి కుముదిని. ఉదయం 8 గంటల నుంచే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుందన్నారు.
The post తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Categories: