hyderabadupdates.com Gallery తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..?

తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..?

తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..? post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కీల‌క‌మైన ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా అస్త‌వ్య‌స్తంగా మారింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో గ‌తంలో 10 ఏళ్ల‌పాటు ఏలిన కేసీఆర్ హ‌యాంలో చ‌క్రం తిప్పిన కె. రామ‌కృష్ణా రావు అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఇలాఖాలో కూడా కీల‌క‌మైన ప‌ద‌వి చేజిక్కించుకున్నారు. ఆయ‌న‌కంటే సీనియ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ సీఎం అండ‌దండ‌లు ఉండ‌డంతో త‌న‌కే సీఎస్ ప‌ద‌వి ల‌భించింది. ఒక ర‌కంగా ఆయ‌న కొలువు తీరడం ప్ర‌తి ఒక్క‌రినీ విస్తు పోయేలా చేసింది. తాజాగా త‌న ప‌ద‌వీ కాలం ద‌గ్గ‌ర ప‌డింది. వ‌చ్చే మార్చి నెల 31 వ‌ర‌కు గ‌డువు మాత్ర‌మే ఉంది. దీంతో రోజులు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో త‌దుప‌రి కీల‌క‌మైన సీఎస్ ప‌ద‌వి ఎవ‌రికి ఇస్తార‌న్నే దానిపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి.
ఇక గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో చ‌క్రం తిప్పిన , ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌లో ముఖ్య భూమిక పోషించిన సీనియ‌ర్ ఐఏఎస్ జ‌యేష్ రంజ‌న్ తో పాటు మ‌రికొంద‌రి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి స‌చివాల‌యంలో. ప్ర‌స్తుతం కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేక స‌త‌మ‌తం అవుతోంది. ఈ త‌రుణంలో కీల‌క‌మైన ఈ ప‌ద‌విలోకి వ‌చ్చే వారికి త‌ల‌కు మించిన భారంగా మార‌నుంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుత సీఎస్ గా ఉన్న రామ‌కృష్ణారావు గ‌త ఏడాది ఆగ‌స్టు నెల‌లోనే రిటైర్ కావాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి ప‌నిగ‌ట్టుకుని కేంద్రానికి త‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించాల‌ని కోర‌డంతో సీఎస్ గా కొన‌సాగుతున్నారు. ఇప్పుడు జ‌యేష్ రంజ‌న్ వైపు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్న‌ట్లు టాక్.
The post తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ

అమ‌రావ‌తి : ఏపీలో త‌మ ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంద‌న్నారు. శ‌నివారం ఎన్టీఆర్ భరోసా

APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

    మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తవుతోంది. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్టు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. సంస్థ