hyderabadupdates.com movies తెలుగు ‘పద్మాలు’ వీరే

తెలుగు ‘పద్మాలు’ వీరే

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 131 మందికి పద్మ అవార్డుల దక్కాయి. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందిని పద్మ శ్రీ వరించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర(మరణానంతరం) పద్మ విభూషణ్, మలయాళ లెజెండరీ నటుడు మమ్మూట్టికి పద్మ భూషణ్ దక్కాయి.

తెలుగు రాష్ట్రాలకు నుంచి 11 మందికి పద్మ అవార్డులు. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ దక్కింది. తెలంగాణకు చెందిన విజయ్‌ ఆనంద్‌రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళి, దీపికారెడ్డిలను పద్మశ్రీ వరించింది.

డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి, గూడూరు వెంకట్రావులకు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్ లకు పద్మశ్రీ దక్కింది. కళా విభాగంలో మాగంటి మురళీమోహన్‌కు పద్మశ్రీ. సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

Related Post

గ్రౌండ్ రిపోర్ట్: చంద్రబాబు జోక్యం తప్పదు!గ్రౌండ్ రిపోర్ట్: చంద్రబాబు జోక్యం తప్పదు!

పైకి అంతా బాగుంద‌ని చెప్పడానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో విశ్లేషించడానికి చాలా తేడా ఉంటుంది. పైకి మెచ్చుకోళ్లకు, మెప్పులకు ప్రభుత్వ పెద్దలు ఒగ్గిపోతే ఎవరు ఏమీ చేయలేరు. కానీ వాస్తవాలను చెప్పే క్రమంలో వస్తున్న విమర్శలను పట్టించుకోకపోతే మాత్రం పెద్ద

హరీష్‌కు ఛాన్సిచ్చేదెవరు?హరీష్‌కు ఛాన్సిచ్చేదెవరు?

‘గద్దలకొండ గణేష్’ లాంటి హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా కన్ఫమ్ అయింది దర్శకుడు హరీష్ శంకర్‌కు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇటు హరీష్ శంకర్.. అటు పవన్ అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ‘గబ్బర్ సింగ్’ కలయికలో