hyderabadupdates.com movies తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే…!

తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే…!

యంగ్ టీమ్ చేసిన సినిమాలను త్వరగా ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేసేది మ్యూజిక్. వినగానే గుర్తుండిపోయే సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ కు తమ సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీమ్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ నాలో ఏదో, అనుకుందొకటిలే అయ్యిందొకటిలే రిలీజై హిట్ కాగా..ఇప్పుడు థర్డ్ లిరికల్ సాంగ్ తెలుసా నీ కోసమే రిలీజ్ చేశారు మేకర్స్. ఈ బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ఇన్ స్టంట్ గా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఆయ్, సేవ్ ది టైగర్స్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ తెలుసా నీకోసమే పాటను ఛాట్ బస్టర్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. ఈ పాట నేపథ్యంలోని భావోద్వేగాలను తన సాహిత్యంలో పలికించారు శ్రీమణి. మంచి ఫీల్ తో హార్ట్ టచింగ్ గా పాడారు అర్మాన్ మాలిక్.

పెళ్లి తర్వాత కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ నవ జంట మనసులోని భావోద్వేగాలకు ప్రతిరూమే తెలుసా నీకోసమే పాట. ‘ గుండెలో చిన్ని గుండెలో ఏడు రంగులవాన, జతగా అడుగేశాక నువు నాతోన, ఎండలో మండుటెండలో వెండి వెన్నెల వాన, కథనం మొదలయ్యాక మన కథతోన, ..తెలుసా నీకోసమే నన్నే దాచాలే, ప్రాణం పంచేంతగా ప్రేమించాలే , తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే , వింటా ఏకాంతమై నీ మౌనాలే..’ అంటూ లవ్, అడ్మిరేషన్, బాండింగ్, ఎమోషన్ తో ఈ పాట సాగుతుంది. ‘

హిట్ ట్యూన్, క్యాచీ లిరిక్స్, బ్యూటిఫుల్ సింగింగ్ తో తెలుసా నీ కోసమే పాట ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Post

Tere Ishk Mein (2025): Some Love Stories Can Never Be Understood…Tere Ishk Mein (2025): Some Love Stories Can Never Be Understood…

Bollywood brings you unconditional romance blended with violence, delusion, rejection, dejection, and grief. Oh wait! Did I say, “unconditional romance”? That’s what interested me when I watched the trailer of

తమన్ హర్ట్ అయ్యాడా?తమన్ హర్ట్ అయ్యాడా?

చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఒక సామాన్యుడిలా నెటిజన్లను ఎంగేజ్ చేస్తుంటాడు తమన్. అభిమానులతో తరచుగా సంభాషణలు చేయడం, వారిని ఎంటర్టైన్ చేసేలా పోస్టులు పెట్టడం తన ప్రత్యేకత. సోషల్ మీడియాలో ట్రోలింగ్

దురంధర్ వల్ల నష్టమంటే నమ్మగలరాదురంధర్ వల్ల నష్టమంటే నమ్మగలరా

ఒకే భాషలో విడుదలై ప్యాన్ ఇండియా ట్యాగ్ లేకుండా 1100 కోట్లు వసూలు చేసి ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్న దురంధర్ వల్ల ఎవరికైనా నష్టం వచ్చిందంటే నమ్మడం కష్టం కానీ ఇది నిజం. మిడిల్ ఈస్ట్ మార్కెట్ కిందకు వచ్చే