hyderabadupdates.com movies తేజు.. ఇంకొంచెం ముందు చేసి ఉంటే…

తేజు.. ఇంకొంచెం ముందు చేసి ఉంటే…

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్‌కు ఇప్పుడు ఓ పెద్ద హిట్ చాలా అవసరం. యాక్సిడెంట్ తర్వాత నటించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ పెద్ద హిట్టయినా.. తన కెరీర్ వేగం పుంజుకోలేదు. తన మావయ్య పవన్ కళ్యాణ్‌తో తొలిసారి కలిసి నటించిన ‘బ్రో’ నిరాశపరిచింది. యాక్సిడెంట్ తాలూకు ఇబ్బందుల వల్ల గ్యాప్ తీసుకోవడం.. ‘గాంజా శంకర్’ క్యాన్సిల్ కావడంతో తేజు కెరీర్లో గ్యాప్ వచ్చింది.

తర్వాత రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో ‘సంబరాల ఏటి గట్టు’ అనే భారీ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ‘హనుమాన్’ నిర్మాతలు వంద కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యారు. రంగంలోకి దిగాక ఖర్చు అంచనాలను మించిపోయింది. కొన్ని రోజులు టీం సైలెంటుగా ఉండిపోయింది. ఇటీవలే ‘సంబరాల ఏటి గట్టు’ టీజర్ ప్రేక్షకులను పలకరించింది. దానికి పాజిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది.

అనగనగా ఒక వెనుకబడ్డ ప్రాంతం.. అక్కడో తెగ.. వారి మీద దారుణమైన అకృత్యాలు జరుగుతుంటాయి. అక్కడి జనం అల్లాడిపోతుంటారు. అప్పుడు ఒక రక్షకుడు వచ్చి వారికి నాయకత్వం వహిస్తాడు. వీరోచితంగా పోరాడతాడు. ఇప్పుడు భాషా భేదం లేకుండా ఈ కథలే ట్రెండుగా మారాయి. ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించి హీరోతో రక్షకుడి అవతారం ఎత్తించి భారీ యాక్షన్ ఘట్టాలు, ఎలివేషన్లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. 

కాకపోతే వివిధ భాషల్లో గత కొన్నేళ్లలో ఈ తరహా సినిమాలు చాలా వచ్చేశాయి. వీటి డోస్ ఎక్కువైపోయి జనాలకు మొహం మొత్తేసే పరిస్థితి వచ్చింది. ‘సంబరాల ఏటి గట్టు’ టీజర్లో విజువల్స్, భారీతనం, తేజు లుక్, తన డైలాగ్స్ అన్నీ బాగున్నా సరే.. ఇలాంటివి గత కొన్నేళ్లలో చాలా చూసేశాం కదా అనే ఫీలింగ్ కలిగింది. ఇలాంటి కథను తేజు కొన్నేళ్ల ముందు చేయాల్సిందని.. అప్పుడైతే తనకు పెద్ద బ్రేకే వచ్చేదని.. ఇలాంటి సినిమాల డోస్‌ బాగా ఎక్కువైపోయి ప్రేక్షకులు మొనాటనస్ ఫీలింగ్‌లోకి వచ్చేసిన సమయంలో రానున్న ఈ సినిమా ఎంతమేర వారిని మెప్పిస్తుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related Post

Telusu Kada will make a historical mark in love stories – Neeraja KonaTelusu Kada will make a historical mark in love stories – Neeraja Kona

Telusu Kada has become the talk of the industry in recent times with each promotional material hitting the bullseye. Siddhu Jonnalagadda’s character from the film has become a talking point

Vara Prasad Becomes Biggest Grosser For Chiru, AnilVara Prasad Becomes Biggest Grosser For Chiru, Anil

This Sankranthi, Telugu cinema witnessed heavy competition, with good number of movies arriving in cinemas. Interestingly, most of the movies were family-friendly entertainers. However, Megastar Chiranjeevi and hit machine Anil