మెగా హీరోల ఫ్లాపుల పరంపరకు ఓజి బ్రేక్ వేసింది. అభిమానులకు పెద్ద ఊరట కలిగిస్తూ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి పెద్ద గ్రాసర్ గా నిలిచింది. ఇకపై హ్యాపీ డేస్ వచ్చేశాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2026లో వరసగా మెగా మూవీస్ క్యూ కట్టిన నేపథ్యంలో ఏవి ఎలా పెర్ఫార్మ్ చేస్తాయనే అనుమానాలు జనాల్లో లేకపోలేదు వాటిలో ముందు వస్తున్నది మన శంకరవరప్రసాద్ గారు. నెగటివ్ టాక్ తో మొదలైన మీసాల పిల్ల సాంగ్ అనూహ్యంగా చార్ట్ బస్టర్ గా మారి ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ దాటేసి దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ పల్స్, మెగాస్టార్ గ్రేస్ ఏ స్థాయిలో మేజిక్ చేశాయో ప్రపంచానికి చూపించేసింది.
తాజాగా వచ్చిన పెద్దిలోని చికిరి చికిరి దానికి మించిన రేంజ్ లో అదరగొట్టేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. రిపీట్ మోడ్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడో రచ్చ, మగధీర నాటి గ్రేస్ ని ఇప్పుడు చూస్తున్నామని మురిసిపోతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం, రెహమాన్ పాట, రత్నవేలు విజువల్స్ అన్నీ ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. జాన్వీ కపూర్ ఎంత అందాలు ఒలకబోసినా మొత్తం దృష్టి చరణ్ మీదే పడేలా చేయడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. మీసాల పిల్ల సాధించిన యాభై మిలియన్లను చాలా తేలికగా దాటేయడం ఖాయం.
సో మన శంకరవరప్రసాద్ గారు, పెద్దిల నుంచి వచ్చిన తొలి రెండు పాటలు తొలి పరీక్షలో పాసై రిలీఫ్ కలిగించాయి. ప్రమోషన్లలో మొదటి అడుగు దిగ్విజయంగా పూర్తి చేశాయి. ఇక నెక్స్ట్ రౌండ్ చిరంజీవి టీమ్ నుంచి ఉంటుంది. డిసెంబర్ నుంచి పబ్లిసిటీని కొత్త పుంతలు తొక్కించేలా రావిపూడి ప్రత్యేక ప్లాన్ తో సిద్ధమవుతున్నాడట. వీటి సంగతలా ఉంచితే సంక్రాంతి పండక్కే ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్ మొదలు కాబోతున్నాయని మైత్రి వర్గాల సమాచారం. ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు హడావిడి ఉంటుంది. సో ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ గా అప్డేట్స్ వర్షం కురవబోతోంది. వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు.