
దాదాపు నాలుగేళ్ల తర్వాత పోలీస్ యూనిఫాం ధరించిన ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్..ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే మందుబాబులను హెచ్చరించిన సజ్జనార్..మరోసారి స్పందించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపుతామని.. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
వాహనదారులకు హితవు పలుకుతూ.. బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు కారణమై మీ జీవితానికి మీరే వెలకట్టలేని జరిమానాను విధించుకోవద్దు…డ్రంకెన్ డ్రైవ్ మీతో పాటు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతుంది అన్నారు.
థింక్ బిఫోర్ యూ డ్రింక్ అండ్ డ్రైవ్. గుర్తుపెట్టుకోండి.. మద్యం తాగి వాహనం నడిపితే మూల్యం తప్పదు. బాధ్యత గల పౌరులుగా మద్యం తాగి వాహనం నడపకండి అని సజ్జనార్ ట్వీట్ చేశారు. ట్రాఫిక్ సమస్య, కల్తీ ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని రోడ్ టెర్రరిస్టులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు, చిన్నారులపై వేధింపులకు పాల్పడితే సీరియస్గా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
The post థింక్ బిఫోర్ యూ డ్రింక్ అండ్ డ్రైవ్! appeared first on Adya News Telugu.