hyderabadupdates.com movies థియేటర్లు సరిపోవట్లేదు మహాప్రభో !

థియేటర్లు సరిపోవట్లేదు మహాప్రభో !

సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి తగ్గట్టు సర్దలేక డిస్ట్రిబ్యూటర్లు కిందా మీదా పడుతున్నారు. మన శంకరవరప్రసాద్ గారుకి అంచనాలకు మించిన బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తున్నారు.

ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న హాళ్లు సరిపోవడం లేదు. ఆన్ లైన్ బుకింగ్స్ కు తోడు కౌంటర్ అమ్మకాల జోరుగా ఉండటంతో రెండు మూడు రోజలకు సరిపడా అడ్వాన్స్ బుకింగ్స్ ముందస్తుగానే అయిపోతోంది. కానీ డిమాండ్ కు తగ్గట్టుగా స్క్రీన్లు పెంచే అవకాశాలు తక్కువగా ఉండటం నెంబర్ల మీద ప్రభావం చూపిస్తోంది.

రాజా సాబ్ ఫలితం తేలినప్పటికీ దాని కోసం చేసుకున్న ఒప్పందాలు, బ్రేక్ ఈవెన్ కోసం పెట్టుకున్న లక్ష్యాలు పెద్దగా ఉండటంతో ఇప్పటికిప్పుడు తీసేయలేని పరిస్థితి నెలకొంది. సెకండ్ వీక్ ఎంటరైతే తప్ప దీంట్లో ఎలాంటి మార్పు ఉండదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తికి యునానిమస్ టాక్ రాకపోయినా రవితేజ గత చిత్రాలతో పోలిస్తే చాలా మెరగనే మాట బయటికి రావడంతో జనం చిన్నగా పెరుగుతున్నారు. గత డిజాస్టర్ల ప్రభావం మాస్ మహారాజా మీద బలంగా ఉంది. ఇక ఫ్రెష్ గా వచ్చిన అనగనగా ఒక రాజు సంగతి తేలాల్సి ఉంది. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు.

సాయంత్రం నుంచి నారి నారి నడుమ మురారి షోలు స్టార్ట్ కాబోతున్నాయి. పాజిటివ్ వైబ్స్ బాగానే ఉన్నాయి. టాక్ వస్తే శర్వానంద్ కూడా బ్యాటింగ్ బ్యాచులో చేరిపోతాడు. ఆదివారం దాకా స్కూళ్లకు సెలవులున్నాయి. స్వంత ఊర్లకు వచ్చిన ఫ్యామిలీస్ శనివారం దాకా థియేటర్లనే ఎంటర్ టైన్మెంట్ ఆప్షన్ గా పెట్టుకుంటారు.

ఉత్తరాంధ్ర, నైజామ్ లో పెద్ద ఎత్తున ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ఇప్పుడున్న సిచువేషన్ లో థియేటర్లు ఎవరికి ఎక్కువ పంచాలో అర్థం కావడం లేదని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. పైగా పోటీ వల్ల వాళ్లలో వాళ్ళకే కొట్లాటలు, వివాదాలున్నాయి. ఫస్ట్ ర్యాంక్ ఎవరో తేలిపోయింది కాబట్టి ఇక మిగిలిన స్థానాలు ఎవరివో చూడాలి.

Related Post

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌తో జరిగిన

సొంత బావ ఫోన్ ఎవ‌రైనా ట్యాప్ చేస్తారా?సొంత బావ ఫోన్ ఎవ‌రైనా ట్యాప్ చేస్తారా?

జనం బాట‌ పేరుతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చిన జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌.. క‌రీంన‌గ‌ర్‌లో యాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డి కార్మికులు, చేతి వృత్తుల వారు, ప్ర‌జ‌లు, మ‌హిళ‌ల‌ను క‌లుసుకున్నారు. అనంతరం ఆమె.. మీడియాతో మాట్లాడుతూ..