hyderabadupdates.com movies దారుణం: ఎన్నిక‌ల్లో పోటీ కోసం… కూతుర్ని చంపేశాడు!

దారుణం: ఎన్నిక‌ల్లో పోటీ కోసం… కూతుర్ని చంపేశాడు!

మ‌హారాష్ట్ర‌లో మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఇప్ప‌టికే ఈ రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసింది. ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ తెర‌మీదికి వ‌చ్చింది. కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజ‌కీయ కోలాహ‌లం నెల‌కొంది.

అయితే.. ఈ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. రిజ‌ర్వేష‌న్‌తో పాటు సంతానంపై కూడా.. సీలింగ్ ఉంటుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మించి సంతానం ఉంటే.. గ్రామీణ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అన‌ర్హులు అవుతారు. ఇది ఎప్ప‌టి నుంచో ఉన్న నిబంధ‌న‌. దీంతో ఎక్కువ మంది పిల్ల‌లు ఉన్న వారు.. పోటీ చేయ‌డం లేదు.

అయితే.. త‌న‌కు ఎక్కువ మంది సంతానం ఉన్న‌ప్ప‌టికీ.. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న అభిలాష‌తో ఓ నాయ‌కుడు దారుణానికి ఒడిగ‌ట్టాడు. త‌న‌కు ముగ్గురు పిల్లలు ఉండ‌డంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం నామినేష‌న్ వేసేందుకు అర్హుడు కాద‌ని తెలుసుకున్న ఓ గ్రామ స్థాయి నాయ‌కుడు.. త‌న పిల్ల‌ల్లోని ఆరేళ్ల ఆడ‌పిల్ల‌ను చంపేశాడు.

త‌ద్వారా.. త‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లేన‌ని న‌మ్మించి.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు రెడీ అయ్యాడు. కానీ.. ఈ వ్య‌వ‌హారం దాగ‌లేదు. తాజాగా తెలంగాణ‌లోని నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని నిజాం సాగర్ కెనాల్‌లో స‌ద‌రు చిన్నారి మృత దేహం ల‌భ్య‌మైంది. దీంతో కూపీ లాగిన పోలీసులు అస‌లు వాస్త‌వాన్ని వెలుగులోకి తెచ్చారు.

మ‌హారాష్ట్ర‌లోని ముఖేడ్ తాలూకా కేరూర్ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని పాండురంగ బాబు(41) నిర్ణ‌యించుకున్నాడు. కానీ, ఆయ‌న‌కు ముగ్గురు సంతానం. దీంతో ఆయ‌న పోటీకి అన‌ర్హుడ‌య్యాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలో ఒక పిల్ల‌ను త‌ప్పిస్తే.. తాను పోటీకి అర్హ‌త సాధిస్తాన‌ని ప‌న్నాగం ప‌న్నిన ఆయ‌న‌.. త‌న స‌న్నిహితుల‌తో క‌లిసి పెద్ద కుమార్తె ప్రాచీని గొంతు నొక్కి.. తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోని ఎడ‌ప‌ల్లికి తీసుకువ‌చ్చి కెనాల్‌లోకి నెట్టేశాడు.

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి బాలిక మృతి చెందింది. ఈ మృత‌దేహం నాలుగు రోజుల కింద‌ట‌.. నిజాంసాగ‌ర్ కెనాల్‌లో క‌నిపించింది. దీనిపై పెద్ద ఎత్తున విచార‌ణ చేశారు. అనేక సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి.

దీంతో లోతుగా విచార‌ణ జ‌రిపిన పోలీసులు.. చివ‌ర‌కు ఈ బాలిక హ‌త్య వెనుక‌.. పంచాయ‌తీ ఎన్నిక‌లు ఉన్నాయ‌న్న కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. వాస్త‌వానికి ఐదేళ్ల ప‌ద‌వి కోసం.. డ‌బ్బులు ఖ‌ర్చు చేసేవారు ఉన్నారు. లేదా ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసేవారు ఉన్నారు. కానీ, ఇలా క‌డుపున పుట్టిన బిడ్డ‌ను కూడా చంపుకునే వారు ఉంటారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ప‌ద‌వి కోసం.. ఎంత‌కైనా బ‌రితెగిస్తార‌న్నదానికి ఇది ఉదాహ‌ర‌ణ‌గా మారింది.

Related Post

ఇచ్చిన హామీ 10 రోజుల ముందే పూర్తి చేసిన పవన్ఇచ్చిన హామీ 10 రోజుల ముందే పూర్తి చేసిన పవన్

నెలా పదిహేను రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్న హామీని 10 రోజుల ముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కోనసీమ

రాజా సాబ్ రాకతో థియేటర్లు కళకళారాజా సాబ్ రాకతో థియేటర్లు కళకళా

ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు పక్కనపెడితే ఏపీ తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ జీవో ఇష్యూ వల్ల ప్రీమియర్లు వేయాల్సిన రాత్రి పెద్ద

The Girlfriend – An Impactful & Thought-Provoking Relationship DramaThe Girlfriend – An Impactful & Thought-Provoking Relationship Drama

The Girlfriend is a 2025 Telugu-language Romantic film written and directed by Rahul Ravindran. The film has Rashmika Mandanna & Dheekshith Shetty playing the lead roles while Anu Emmanuel, Rao