hyderabadupdates.com movies దాస్ మీద సల్మాన్ సూపర్ పంచ్

దాస్ మీద సల్మాన్ సూపర్ పంచ్

కొన్ని వారాల క్రితం దర్శకుడు మురుగదాస్ తన సికందర్ ఫెయిల్యూర్ గురించి ప్రస్తావిస్తూ సల్మాన్ ఖాన్ రాత్రి తొమ్మిది గంటల తర్వాత షూటింగ్ కు రావడం వల్లే చాలా సమస్యలు వచ్చాయని, అందువల్లే తాను అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోయానని నెపం మొత్తం కండల వీరుడి మీదకు తోసేశాడు. ఇది సల్లు భాయ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. నాసి రకం కథ కథనాలతో ఇలాంటి సినిమా తీయడమే కాక నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తమ హీరో మీద ఎన్నడూ లేని మచ్చ వేస్తావా అంటూ ఆయన మీద కయ్యిమన్నారు. ఇప్పుడు నేరుగా సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగేశాడు.

బిగ్ బాస్ 13 షోలో ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ మురుగదాస్ మీద సూపర్ పంచులు వేసేశాడు. విపరీత గాయాల వల్ల నేను షూటింగ్ కి ఆలస్యంగా వస్తే దాన్ని ఇంకోలా చెప్పుకుని నెగటివ్ చేశారని, ముందు నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా తప్పుకుంటే ఆ తర్వాత సౌత్ సినిమా మదరాసి తీయడానికి మురుగదాస్ వెళ్లిపోయారని, అక్కడి యాక్టర్ సాయంత్రం ఆరు గంటలకే సెట్ కు వచ్చేవాడని, అందుకే అది సికందర్ కన్నా చాలా పెద్ద సినిమా ప్లస్ బ్లాక్ బస్టర్ అయ్యిందని గట్టిగా కౌంటర్ వేసేశాడు. మదరాసి ఫలితం అందరికీ తెలిసిందే. ఒరిజినల్ తమిళ వర్షన్ సైతం యావరేజ్ గా నిలిచింది.

ఇంత ఓపెన్ గా సల్మాన్ ఖాన్ పంచులు వేయడం చాలా అరుదు. ఒకవేళ మురుగదాస్ కనక తన ప్రమోషన్లలో సికందర్ ప్రస్తావన తేకపోయి ఉంటే ఇప్పుడీ గొడవ ఉండేది కానీ డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ మీద నింద వేయడం ఇక్కడి దాకా తెచ్చింది. విచిత్రంగా శివ కార్తికేయన్ ఈయనతో మరో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారనే వార్త అభిమానుల్లో ఆల్రెడీ హాట్ టాపిక్ అయ్యింది. ఇది నిజమో కాదో కానీ ఫ్యాన్స్ మాత్రం వద్దు బాబోయ్ అంటున్నారు. అయినా హీరో సహకరించినా సహకరించకపోయినా కంటెంట్ కి బాధ్యుడు ముమ్మాటికి దర్శకుడే. సికందర్ కూ ఇదే వర్తిస్తుంది. మళ్ళీ దాస్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Related Post

రీమేక్ బెటర్ దన్ ఒరిజినల్.. లిస్టు చూస్తే షాకేరీమేక్ బెటర్ దన్ ఒరిజినల్.. లిస్టు చూస్తే షాకే

సౌత్ ఇండియాలో ఆన్ లైన్ ఫ్యాన్ వార్స్ అత్యధికంగా జరిగేది తెలుగు సినీ అభిమానుల మధ్యే అంటే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. తమిళంలో, కన్నడలో కూడా మన వాళ్లకు దీటుగా అక్కడి అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. వీళ్లకు పెద్ద కారణం