hyderabadupdates.com movies ‘దురంధర్’ సక్సెస్ వెనుక ఆమె

‘దురంధర్’ సక్సెస్ వెనుక ఆమె

దురంధర్, దురంధర్-2 చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌లో ప్రకంపనలు రేపాడు ఆదిత్య ధర్. కేవలం ఒక సినిమా అనుభవంతో అతను తెర మీద ఇలాంటి ఔట్ పుట్ తీసుకురావడం.. బాక్సాఫీస్‌ను ఇలా షేక్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఐతే ఈ సక్సెస్ క్రెడిట్లో కొంత తన భార్య యామి గౌతమ్‌కు ఇవ్వాల్సిందే. ఆమె ‘దురంధర్-2’లో చిన్న క్యామియో రోల్ చేసింది. అందుకు ఆమెకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పెద్దగా పేరు లేని సమయంలోనే ఆదిత్యను నమ్మి అతడికి సపోర్ట్ చేసినందుకు ఆమెకు క్రెడిట్ ఇవ్వాలి.

ఆదిత్య తొలి చిత్రం.. యురి: ది సర్జికల్ స్ట్రైక్. ఆ సినిమా పరిమిత బడ్జెట్లో తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది. ఐతే ఆ సినిమా మేకింగ్ టైంలోనే ఆదిత్యతో యామి ప్రేమలో పడింది. ఈ మూవీ రిలీజయ్యాక కొంత కాలానికి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఆదిత్య అద్భుతాలు చేయగలడని యామి ముందే నమ్మింది.

అందుకే తాను అప్పటికే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. బడ్డింగ్ డైరెక్టర్ అయిన ఆదిత్య మీద నమ్మకముంచింది. తనకు అండగా నిలిచింది. అతడిని పెళ్లి కూడా చేసుకుంది. బాలీవుడ్లో ఆదిత్యకు పెద్దగా సపోర్ట్ లేకపోయినా.. యామి మాత్రం తనకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడతను ‘దురంధర్’, ‘దురంధర్-2’ చిత్రాలతో ఎక్కడికో వెళ్లిపోయాడు. దేశవ్యాప్తంగా అతడి మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఒక వ్యక్తి పెద్ద విజయాలు అందుకున్నాక తన చుట్టూ అందరూ చేరతారు. కానీ అతను సాధారణ స్థాయిలో ఉన్నప్పుడే అండగా నిలిచి ప్రోత్సహించేవాళ్లు గొప్ప. యామి.. ఆదిత్యకు అలాగే అండగా నిలిచింది. ఆదిత్య గొప్ప స్థాయిలో లేనపుడే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచింది. అందుకే ఇప్పుడు యామిని అందరూ కొనియాడుతున్నారు. ఇలాంటి సపోర్ట్ ఇస్తే అందరూ అద్భుతాలు చేస్తారని ఆమెను కొనియాడుతున్నారు

Related Post

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా ఐ ఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆలయ ప్రదక్షిణ మండప నిర్మాణంతో

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండపునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు అండగా నిలుస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎస్‌ఎంఏ టైప్–1 కారణంగా పిల్లల్లో కండరాలు క్రమంగా