ముంబై : బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ యజమాని ప్రీతి జింతా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన దురంధర్ సీక్వెల్ మూవీ దురంధర్ – 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దురంధర్ -1 రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సందర్బంగా స్పందించింది ప్రీతి జింతా. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంది . గురువారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడే ధురందర్ 2 చూశాను. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, రివెంజ్ ఉంటే ధురందర్ లా ఉండాలి, లేకపోతే ఉండకూడదు అని పేర్కొంది ప్రీతి జింతా.
దర్శకత్వం, నటన, సంగీతం, ఎడిటింగ్, కథ, నటీనటుల ఎంపిక , ప్రతి ఇతర విభాగం కూడా అమోఘం అంటూ ప్రశంసలు కురిపించింది. సినిమా చూసిన తర్వాత అమ్మ చెప్పిన మొదటి మాట, తన స్నేహితులతో కలిసి థియేటర్లో మళ్ళీ చూడాలన్నది. నాకు కూడా సరిగ్గా అలాగే అనిపిస్తోందని అని తెలిపింది. అంతే కాదు దర్శకుడు ఆదిత్య ధర్ ను ఆకాశానికి ఎత్తేసింది. ఆదిత్యా నన్ను మీ అభిమానిగా మార్చేశారని పేర్కొంది. ఇంతటి అద్భుతమైన అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపింది ప్రీతి జింతా. మీ నైపుణ్యం, మీ ప్రతిభ, అన్నింటికన్నా ముఖ్యంగా మీ మనసు చాలా మంచిది అని కితాబు ఇచ్చింది.
నా మనసు మీపై పడింది. ఎంత అద్భుతమైన నటన. ఎంతటి వైవిధ్యం, ఎంతటి లోతు, ఎంతటి నిజాయితీ. నా ఆలోచనలను వ్యక్తపరచడానికి ముందు, నేను ఇంకా ఈ విషయాన్ని జీర్ణించు కోవాల్సి ఉంది. ఈ మూవీలో నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది సారా అర్జున్ నటన అని ప్రశంసించింది.
The post దురంధర్ -2 అదుర్స్ ఆదిత్య ధర్ సూపర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
దురంధర్ -2 అదుర్స్ ఆదిత్య ధర్ సూపర్
Categories: