hyderabadupdates.com movies దురంధర్ 2 నిడివి గురించి టెన్షన్ టెన్షన్

దురంధర్ 2 నిడివి గురించి టెన్షన్ టెన్షన్

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో దురంధర్ 2 నిడివి గురించి తెగ చర్చ జరుగుతోంది. ఏకంగా 3 గంటల 55 నిమిషాల ఫైనల్ వెర్షన్ ని దర్శకుడు ఆదిత్య ధార్ లాక్ చేశాడనే వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. నిజానికి మూడు గంటల నలభై నిమిషాలకు సెన్సార్ కాపీ సిద్ధమయ్యిందనే వార్త వచ్చిన కొన్ని గంటలకే ఫ్రెష్ అప్డేట్ రావడం గమనార్హం.

అంటే ఇంటర్వెల్ తో కలిపి ప్రేక్షకులు 4 గంటల 10 నిమిషాలు థియేటర్లోనే ఉండాల్సి వస్తుంది. జెపి దత్తా ఎల్ఓసి లైన్ అఫ్ కంట్రోల్ తర్వాత ఇంత సుదీర్ఘమైన నిడివితో ఏ ఇండియన్ మూవీ రాలేదు. ఒకవేళ నిజమైతే మాత్రం రణ్వీర్ సింగ్ కెరీర్ లో అరుదైన ఘనత చేరుతుంది.

ఇక టెన్షన్ దేనికనే పాయింట్ కు వద్దాం. ఇంత లెన్త్ ఉంటే మల్టీప్లెక్సుల్లో షోలు షెడ్యూల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఒక్క షోకు సగటు నాలుగున్నర గంటలు పడితే (క్లీనింగ్ తో కలిపి) రోజుకు నాలుగు ఆటలే వేసినా పదహారు గంటలు అక్కడే అయిపోతాయి.

అంటే డబుల్ షిఫ్ట్స్ వేసి సిబ్బందితో పని చేయించాల్సి ఉంటుంది. ఓవర్ నైట్ జీతాలు అదనంగా ఇవ్వాలి. తెల్లవార్లు స్క్రీన్లు రన్ అవుతూనే ఉండాలి. హిట్ టాక్ వస్తే కనీసం రెండు వారాల పాటు ఈ పరిణామాల్లో ఎలాంటి మార్పు ఉండదు. రోజుకు ఒక్క షో తగ్గిపోవడం వల్ల కలెక్షన్లు బాగా ప్రభావితం చెందుతాయి. ఇది అసలు ఆందోళన.

అసలే కాంపిటీషన్ లో టాక్సిక్ ఉంది. రెండింటికి షోలు పంచాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్ల మీద ఉంది. అలాంటప్పుడు దురంధర్ 2 ఇంత నిడివితో వస్తే ప్రాక్టికల్ గా చాలా సమస్యలు వస్తాయి. నిర్మాతలు ఎడిటింగ్ చేయమని ఆదిత్య ధార్ ని కోరుతున్నారట.

ప్రస్తుతానికి ఫుల్ వెర్షన్ సెన్సార్ చేయించి తదుపరి నిర్ణయం ఈ వారంలోనే తీసుకునే దిశగా చర్యలు ప్రారంభమైనట్టు ముంబై టాక్. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ట్రైలర్ రాకుండానే వెయ్యికిపైగానే టికెట్లు అమ్ముడుపోవడం క్రేజ్ ని సూచిస్తున్నాయి. వీలైనంత త్వరగా నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తే బెటర్. 

Related Post

Jared Padalecki’s Top 10 Performances as Sam Winchester on Supernatural
Jared Padalecki’s Top 10 Performances as Sam Winchester on Supernatural

Jared Padalecki portrayed beloved younger brother Sam Winchester on Supernaturalfor 15 seasons and just as many years, and these 10 performances are his best overall on the show. Padalecki’s true

Meenakshi Chaudhary Shines as ‘Daksha’ in Naga Chaitanya’s Mythical Thriller #NC24Meenakshi Chaudhary Shines as ‘Daksha’ in Naga Chaitanya’s Mythical Thriller #NC24

Yuva Samrat Naga Chaitanya, fresh from the blockbuster success of Thandel, is all set to surprise audiences with a never-before-seen mythical thriller titled #NC24. The film is directed by Karthik

టాక్సిక్ మనసులో అసలు ఏముందోటాక్సిక్ మనసులో అసలు ఏముందో

ఇంకో మూడు రోజులు దాటితే టాక్సిక్ విడుదల కేవలం నెల రోజుల్లో ఉంటుంది. ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా ఎలాంటి సౌండ్ లేకపోవడం చూసి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దురంధర్ 2 లాంటి పోటీని ఎదురుగా పెట్టుకుని నిర్లిప్తంగా ఉండటం ఎంత మాత్రం