hyderabadupdates.com movies దురంధర్-2 వాయిదా పడితే..?

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య విడుదలైన ‘దురంధర్’ ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా రూ.1400 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ కథను ముగించకుండా మధ్యలో ఆపిన దర్శక నిర్మాత ఆదిత్య ధర్.. సినిమా చివర్లో ‘దురంధర్-2’కు లీడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మార్చి 19న రిలీజ్ అని కూడా అప్పుడే ప్రకటించాడు. ఐతే పార్ట్-2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇంత త్వరగా ‘దురంధర్-2’ను హడావుడిగా తీసుకురావడం కరెక్టేనా అని ముందు నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చిత్రం వాయిదా పడుతుందని గతంలో ప్రచారం కూడా జరిగింది. కానీ ఆదిత్య వెనక్కి తగ్గలేదు. మార్చి 19నే రిలీజ్ అని ప్రకటించాడు.

కానీ బాలీవుడ్లో ప్రస్తుతం మళ్లీ ‘దురంధర్-2’ వాయిదా గురించి డిస్కషన్ నడుస్తోంది. అక్కడి మీడియాలో కూడా దీని మీద వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ‘దురంధర్-2’ షూట్ జరుగుతూనే ఉన్నట్లు సమాచారం. కొన్ని సన్నివేశాలను రీషూట్ కూడా చేస్తున్నారట. ఇటీవల ఊహించని విధంగా ‘బీఎంఎస్’ వివాదం ‘దురంధర్-2’ చిత్ర బృందాన్ని ఇరుకున పెట్టింది. దాని వల్ల షూట్‌కు కొన్ని రోజులు బ్రేక్ పడింది. ఆ సన్నివేశాలను ఇప్పుడు వీఎఫెక్స్‌లో చేసుకోవాల్సి వస్తోందట.

దీనికి తోడు పాటలు, బీజీఎం పనులు.. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆలస్యమవుతోందట. ఇంకో నెల రోజుల్లోపు సినిమాను డెలివర్ చేయడం చాలా కష్టమైన పనే అని యూనిట్ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ హడావుడి వల్ల ఔట్ పుట్ మీద ప్రభావం పడుతుందని.. అందుకే కొంచెం టైం తీసుకుని మిడ్ సమ్మర్లో సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని.. కొన్ని రోజుల్లో ఏదో ఒక స్పష్టత వస్తుందని అంటున్నారు. ‘దురంధర్-2′ వాయిదా పడితే.. ‘టాక్సిక్’ మూవీకి అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుందనడంలో సందేహం లేదు.

Related Post

Deva Katta: If Magadheera, Eega, Baahubali & RRR are put together, you get VaranasiDeva Katta: If Magadheera, Eega, Baahubali & RRR are put together, you get Varanasi

Varanasi, spearheaded by Superstar Mahesh Babu and directed by SS Rajamouli, is one of the most anticipated films of Indian cinema. The title launch event held in RFC, Hyderabad took