hyderabadupdates.com Gallery దూసుకుపోతున్న ధనుష్‌!

దూసుకుపోతున్న ధనుష్‌!

ఈ ఏడాదిలో సౌత్ హీరోల నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. అలాంటి వారిలో ధనుష్ కూడా ఒకరు. ఆయన ఈ సంవత్సరం ఇప్పటికే కుబేర, ఇడ్లీ కొట్టు సినిమాలతో ప్రేక్షకులను కలిసాడు. కానీ ఇక్కడితో ఆగిపోకుండా మూడో సినిమాను కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. అదే ఆయన బాలీవుడ్ సినిమా “తేరే ఇష్క్ మైన్”. ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది.

ఇదే కాక మరో రెండు నెలల గ్యాప్ లోనే ధనుష్ నుంచి మరో సినిమా రానుంది. ఇది ఆయన కెరీర్ లో 54వ చిత్రం అవుతుంది. ఈ సినిమా దర్శకత్వం విగ్నేష్ రాజా వహించారు. షూటింగ్ పనులు ఇటీవల పూర్తవ్వడంతో ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
The post దూసుకుపోతున్న ధనుష్‌! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Cyclone Montha: ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !Cyclone Montha: ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !

    ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 6 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తోంది. పోర్ట్ బ్లేయర్ పశ్చిమ దిశకు 620 కిలోమీటర్లు, చెన్నైకు తూర్పు ఆగ్నేయ దిశలో 780 కిలోమీటర్ల దూరంలో ఉంది.

IPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటుIPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు

IPS officer : హరియాణాలోని సీనియర్‌ ఐపీఎస్ అధికారి పూరన్‌ కుమార్‌ (Pooran Kumar) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీటీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్న‌ట్టుండి ఆయ‌న‌ను బ‌దిలీ చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా