hyderabadupdates.com movies దొంగ దొరికాడు – ఐ బొమ్మ యజమాని అరెస్ట్

దొంగ దొరికాడు – ఐ బొమ్మ యజమాని అరెస్ట్

ఇండస్ట్రీని ప్రధానంగా వేధిస్తున్న సమస్యల్లో పైరసీ చాలా తీవ్రమైంది. ఎన్ని చర్యలు తీసుకున్నా రూపం మార్చుకుంటోంది తప్ప తన పనిని ఆపడం లేదు. ఆ మధ్య హైదరాబాద్ పోలీసులు ఒక పెద్ద రాకెట్ ని ఛేదించి కొందరిని అరెస్ట్ చేశారు. అయినా ఈ భూతం కొనసాగుతూనే ఉంది. అయితే ఆన్ లైన్ పైరసీ అధిక శాతం టొరెంట్ లింక్స్, టెలిగ్రామ్ యాప్స్ ఆపరేట్ చేయడం తెలిసిన వాళ్లకు మాత్రం డౌన్లోడ్ అయ్యేది. అందుకే సగటు సామాన్యులు వీటికి దూరంగా ఉండేవాళ్ళు. ఈ వర్గాన్ని టార్గెట్ చేసుకుని తెచ్చిన సులభతరమైన యాప్ ఐ బొమ్మ అతి తక్కువ టైంలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

ఎక్కడో విదేశాల్లో ఉంటూ కొత్త సినిమాలను పైరసీ చేస్తూ ఉచితంగా ఐ బొమ్మ యాప్ లో పెడుతున్న నిర్వాహకులను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. విదేశీ చట్టాల్లోని లొసుగులు వాడుకుంటూ ఇన్నాళ్లు తప్పించుకుంటూ ఉన్నారు. పై పెచ్చు నిర్మాతలను తమ సైట్ లో బహిరంగంగా బెదిరించడం కవ్వించడం లాంటివి కూడా చాలా చేశారు. తాజాగా ప్రాన్స్ నుంచి వచ్చిన ఐబొమ్మ యజమాని ఇమ్మడి రవిని హైదరాబాద్ కూకట్ పల్లి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడే పైరసీని ఆపరేట్ చేస్తున్న ఇతని మీద ప్రొడ్యూసర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి.

ఇప్పుడీ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం ద్వారా మరో పెద్ద డొంకని కదిలించినట్టే. మరిన్ని వివరాలు విచారణలో బయట పడబోతున్నాయి. అతని బ్యాంకు అకౌంట్లలో ఉన్న మూడు కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టు ప్రాధమిక సమాచారం. వీలైనంత వరకు ఇలాంటి వాళ్ళను బయటికి రాకుండా కఠిన శిక్ష పడేలా చేస్తే ఇతరులకు భయం ఉంటుంది. వేల కోట్ల రూపాయల నష్టాన్ని పరిశ్రమకు కలగజేస్తున్న ఐబొమ్మ లాంటి అనధికార యాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి సారించాలి. సదరు ఇమ్మడి రవి నుంచి దీనికి సంబంధించిన కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.

Related Post

Is Avatar 3 getting a Mahesh Babu surprise? Varanasi first glimpse likely to be attachedIs Avatar 3 getting a Mahesh Babu surprise? Varanasi first glimpse likely to be attached

Varanasi, starring Mahesh Babu in the lead role, is currently in the works with director SS Rajamouli helming the project. As the film’s production continues, the makers recently unveiled the

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీపరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది. రేపు థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ కావడం లేదు. థియేటర్ల కొరత, స్ట్రెయిట్ సినిమాల పోటీ,