hyderabadupdates.com movies ద్రౌపది వివాదం… చిన్మయి పాటను మారుస్తారట

ద్రౌపది వివాదం… చిన్మయి పాటను మారుస్తారట

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా ఫెమినిజం మీద ఆవిడకు, నెటిజెన్లకు పలుమార్లు పెద్ద యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. కానీ తాజాగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వివాదంలో ఏకంగా ఆమె పాటను తీసేయాలని నిర్ణయించుకోవడం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే ఆరు సంవత్సరాల క్రితం దర్శకుడు మోహన్ జీ తమిళంలో ద్రౌపది అనే సినిమా తీశారు. అప్పట్లో ఇది చాలా వివాదాస్పదమయ్యింది. కమర్షియల్ గా ఆడలేదు కానీ మహిళా సంఘాలు, పలువురు కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కంటెంట్ మీద విరుచుకుపడ్డారు.

వాళ్ళలో చిన్మయి కూడా ఉన్నారు. మోహన్ జీ ఆడవాళ్లను కించపరుస్తున్నారని, కులాల మధ్య చిచ్చు పెట్టేలా కథలు రాస్తున్నారని విమర్శలు చేశారు. మోహన్ జీ దానికి బదులిస్తూ ఆమె కేవలం ఒక వర్గానికి పక్షపాతిగా మాట్లాడుతున్నారని, తాను నిజమే చూపించానని అన్నారు.

అలా వాదోపవాదాలు జరిగి తర్వాత అందరూ మర్చిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు ద్రౌపది 2 వస్తోంది. అది కూడా ప్యాన్ ఇండియా భాషల్లో. దీంట్లో చిన్మయితో ఏమొకే అనే పాట పాడించారు సంగీత దర్శకడు జిబ్రాన్. ఆడియో యూట్యూబ్ లో ఉంది. అయితే ఇప్పుడు చిన్మయి స్థానంలో వేరే సింగర్ తో పాడించి థియేటర్లో మార్పిస్తామని తాజాగా మోహన్ జీ వెల్లడించారు.

జిబ్రాన్ తో పద్దెనిమిది సంవత్సరాల స్నేహం కారణంగానే సినిమా ఏమిటో, ఎవరిదో తెలియకుండా స్టూడియోకు వెళ్లి పాడేశానని, ఒకవేళ ముందే తెలిసి ఉంటే ఐడియాలజీలో ఇన్ని విభేదాలు ఉన్న వాళ్లతో తాను పని చేసేదాన్ని కాదని చిన్మయి చెప్పడంతో మోహన్ జీకి మరింత ఆగ్రహం కలిగించింది.

తన సినిమాకు నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారనేది ఆయన కంప్లయింట్. 14వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ లో మూండ్రం వల్లెల మహారాజా పుస్తకం ఆధారంగా రూపొందుతున్న ద్రౌపది 2ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఇందులో కూడా కాంట్రావర్సి అంశాలు చాలా ఉండబోతున్నాయని చెన్నై టాక్. అదేంటో రిలీజయ్యాక చూడాలి.

Related Post

Police Book Lulu Mall, Organisers After Crowd Chaos at Nidhhi Agerwal EventPolice Book Lulu Mall, Organisers After Crowd Chaos at Nidhhi Agerwal Event

Hyderabad police have registered a suo motu case against the management of Lulu Mall and the organisers of a promotional event following a serious crowd control lapse at Kukatpally Housing

జూబ్లీహిల్స్‌లోకి ష‌ర్మిల‌కు నో ఎంట్రీ.. రీజ‌నేంటి ..?జూబ్లీహిల్స్‌లోకి ష‌ర్మిల‌కు నో ఎంట్రీ.. రీజ‌నేంటి ..?

హైదరాబాదులోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇక్కడ పాగా వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన బలాన్ని