ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల విషయంలో చూపిస్తున్న అలసత్వం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించేలా ఉంది. రేపో ఎల్లుండో ధనుష్ వచ్చి ఈవెంట్ చేసినా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు అది సరిపోదు. ఇంకేదో సౌండ్ చేయాలి. ఇడ్లి కొట్టు, రాయన్ లాంటివి మన దగ్గర దారుణంగా ఫెయిలవ్వడంతో ఇక్కడ మార్కెట్ ధనుష్ లైట్ తీసుకున్నారేమో బహుశా.సరే బజ్ సంగతి పక్కనపెడితే కరలో మన స్టువర్ట్ పురం ఛాయలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ఒకప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో దొంగల ఊరిగా బాగా ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. ఈ ఊరి మీద యండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల రాస్తే ఆయన దర్శకత్వంలోనే చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ లో నటించారు. అది డిజాస్టరయ్యింది. అదే టైంలో స్టువర్ట్ పురం దొంగలు అనే మరో భాను చందర్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కొట్టింది. ఇది 1991 నాటి ముచ్చట.రవితేజ టైగర్ నాగేశ్వరరావు బ్యాక్ డ్రాప్ కూడా దీని ఆధారంగా తీసుకున్నదే. అయితే ఇది పీరియాడిక్ బయోపిక్. కరలో మెయిన్ పాయింట్ స్టువర్ట్ పురం నేపధ్యానికి దగ్గరగా ఉంటుందని, దొంగతనాలకు అలవాటు పడిన ఒక యువకుడి జీవితం సామజిక, రాజకీయ పరిస్థితుల వల్ల ఎలాంటి మలుపులు తీసుకుందనే పాయింట్ మీద దీన్ని రూపొందించారట. ఏప్రిల్ 30 రావాల్సిన పెద్ది తప్పుకోవడంతో కరకు ఇతర రాష్ట్రాల్లో బెనిఫిట్ కానుంది.ఫలితం మీద ధనుష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మన దగ్గరే కాదు తమిళనాడులోనూ బాక్సాఫీస్ డల్ గా ఉంది. జనవరిలో జన నాయకుడు వాయిదా పడ్డాక అంత ఊపు ఇచ్చే సినిమాలు పెద్దగా రాలేదు. రాధికా తాయ్ కిళవి లాంటివి కొంత ఊరట కలిగించాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు కర కనక సక్సెస్ అయితే థియేటర్లకు ఆక్సిజన్ దొరుకుతుందని బయ్యర్లు ఆశపడుతున్నారు. తమిళ నేటివిటీ నిండిన కరని మనోళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ధనుష్ ‘కర’లో స్టువర్టుపురం ఛాయలు
April 26, 2026April 26, 2026|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:09 am
Categories:
Related Post
Wedding Date locked for Bellamkonda Sai SreenivasWedding Date locked for Bellamkonda Sai Sreenivas
March 28, 2026March 28, 2026|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:10 am
Tollywood young actor Bellamkonda Sai Sreenivas found his lady love and he made it official recently. Bellamkonda Sai Sreenivas is in love with Kavya Reddy and their parents have approved
K-Ramp Box Office Hit: Kiran Abbavaram’s Diwali Magic Continues!K-Ramp Box Office Hit: Kiran Abbavaram’s Diwali Magic Continues!
October 20, 2025October 20, 2025|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:06 am
Kiran Abbavaram is back with a bang this Diwali as his latest film “K-Ramp” smashes the box office with a ₹4.5 crore opening day collection. Audiences loved the film’s mix
Nagarjuna brings back his favourite heroineNagarjuna brings back his favourite heroine
October 9, 2025October 9, 2025|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
3:38 pm
Akkineni Nagarjuna often openly expresses his admiration for yesteryear actress Tabu with whom he and his family share a great rapport. Their on-screen chemistry started with the iconic family entertainer