hyderabadupdates.com movies ధర్మల్ డ్రోన్ తో ‘పుష్ప’లపై నిఘా!

ధర్మల్ డ్రోన్ తో ‘పుష్ప’లపై నిఘా!

‘అడవిలో ఎలాంటి అలికిడి, అలజడి గుర్తించినా, రక్షణ దళాలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. అక్రమార్కుల ఆట కట్టించాలి..’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్ర చందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం ఎర్రచందనం స్మగ్లింగు జరిగే అవకాశం ఉన్న ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ డ్రోన్లతో నిఘాను పెంచాలి. అటవీ చెక్ పోస్టులను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను అమర్చి, నిత్యం పర్యవేక్షణ చేయాలి. సరికొత్త బ్యారికేడ్లను చెక్ పోస్టుల వద్ద అమర్చి, బేస్ క్యాంపులు, వాచ్ టవర్లలో గస్తీ ముమ్మరం చేయాలని ఆయన సూచించారు.

వైసీపీ హయాంలో అంతర్రాష్ట్ర ఒప్పందాలను పట్టించుకోలేదన్నారు. ఫలితంగా ఎర్రచందనం సరిహద్దులు దాటి వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్నా, దాన్ని వెనక్కు తీసుకురాలేకపోయారని తెలిపారు. ఇటీవల కర్ణాటకకు వెళ్లినపుడు రూ.140 కోట్ల ఎర్రచందనం వారు పట్టుకొని, అమ్ముకున్నట్లు చెప్పడం తనను ఆలోచింపజేసిందని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర ఒప్పందాలను పటిష్టంగా అమలు చేసి ఉంటే, ఆ సంపద మనకు దక్కేదన్నారు. ఈ అంశంపై కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారితో చర్చించానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

మన రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా అయిన ఎర్రచందనం దుంగలు దేశంలో ఎక్కడ దొరికినా మనకు చెందేలా ప్రత్యేకంగా ఆదేశాలను ఇప్పించాం అన్నారు. దీంతోనే ఇటీవల గుజరాత్ లో 5 టన్నులు, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల్లో 7 టన్నులు, కర్ణాటకలో 6 టన్నులు, ఢిల్లీలో 10 టన్నులు సీజ్ చేశాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నేపాల్ లో ఉన్న 173 టన్నల ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు వివిధ రాష్ట్రాల్లో 2019-24 ప్రాంతాల్లో పట్టుబడిన 407 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.

తాను ఇటీవల సందర్శించిన తిరుపతిలోని 8 గోదాముల్లో 2,63,267 ఎర్రచందనం దుంగులున్నాయి. కేవలం పట్టుబడిన దుంగలను బట్టి చూస్తేనే సుమారు 2 లక్షల చెట్లు నరికినట్లు అర్ధమవుతోంది. మరి అక్రమ మార్గాల్లో ఎన్ని లక్షల చెట్లను నరికివేశారో ఊహకు అందటం లేదు. ఎర్రచందనం అనేది పర్యావరణహితమైన చెట్టు. అత్యంత పటిష్టంగా శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన వృక్షం. ఇక నుంచి ఎర్రచందనం ఒక్క దుంగ కూడా బయటకుపోకుండా చేయాలి. దీనికి మన ముందున్న దారులన్నీ వినియోగించుకుందాం. మళ్లీ టాస్క్ ఫోర్సుకు జీవం పోసి, అక్రమ రవాణా నిరోధించే ప్రణాళికపై ముఖ్యమంత్రితో మాట్లాడుతాను. స్మగ్లర్లపై పెట్టిన కేసుల్లోనూ న్యాయస్థానాల నుంచి వేగంగా తీర్పులు రావడం శుభసూచకం. అటవీ శాఖ సిబ్బంది ఎర్ర చందనం సంరక్షణను ఒక సంకల్పంలా తీసుకోవాలని ఆయన సూచించారు.

Related Post

జన నాయకుడు కోసం పెద్ద చేతులుజన నాయకుడు కోసం పెద్ద చేతులు

అసలే సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉంది. పైగా భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం. ఎంత విజయ్ హీరో అయినా తెలుగు వరకు జన నాయకుడు మీద విపరీతమైన బజ్ లేదన్నది వాస్తవం. అయినా సరే తన స్టార్ పవర్ ఇక్కడ