hyderabadupdates.com movies నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్ లో వాడటంతో పాటు టీవీ, యూట్యూబ్ లో మిలియన్ల సంఖ్యలో ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు.

జనవరి 1 నూతన సంవత్సర కానుకగా థియేటర్లలో రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆశించిన స్థాయిలో భారీ స్పందన కనిపించలేదు. సంక్రాంతి పండగ మూడ్ లో ఉన్న జనాలు దీన్ని లైట్ తీసుకున్నారు. ఇంత రిపీట్ వేల్యూ ఉన్న బ్లాక్ బస్టర్ కి ఇలాంటి రెస్పాన్స్ ఊహించనిది. అయితే ఇక్కడితో అయిపోలేదు.

మాములుగా రీ మాస్టరింగ్ చేసి రీ రిలీజ్ కోసం సిద్ధం చేసిన సినిమాల ప్రింట్లను నిర్మాణ సంస్థలు ఓటిటిలకు ఇవ్వడం లేదు. ఆన్ లైన్ లోనూ పెట్టడం లేదు. మురారి, శివ, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఆది, చెన్నకేశవరెడ్డి, మన్మథుడు లాంటివి థియేటర్స్ కు వచ్చాక వాటి హక్కులు ఉన్న ఓటిటిలో అప్డేట్ కాలేదు. పాత ప్రింట్లనే కొనసాగిస్తున్నారు. ఒక్క ఆదిత్య 369 మాత్రమే వచ్చింది. కానీ క్వాలిటీ పెద్దగా లేకపోవడంతో ఎగ్జైట్ మెంట్ రాలేదు.

అయితే నువ్వు నాకు నచ్చావ్ నిర్మాత రవి కిషోర్ ఈ ట్రెండ్ లో వెళ్ళలేదు. తాజాగా విడుదల చేసిన నువ్వు నాకు నచ్చావ్ 4కె ప్రింట్ ని ఏకంగా యూట్యూబ్ లో ఉచితంగా పెట్టేశారు.

ఇలా చేయడం వల్ల ఫ్యాన్స్ కే కాదు మూవీ లవర్స్ నోస్టాల్జిక్ మూమెంట్స్ ని ఎలాంటి ఖర్చు లేకుండా అందుకుంటారు. ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్ లో పెట్టేయడం చూస్తే వ్యూస్ పెద్ద ఎత్తున వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వెంకటేష్ టైమింగ్, ఆర్తి అగర్వాల్ అందం, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, కోటి అద్భుతమైన పాటలు నువ్వు నాకు నచ్చావ్ ని ఒక కంప్లీట్ ప్యాకేజీలా మార్చేశాయి.

ఈ సినిమాని సమర్పించిన సురేష్ బాబు ఇదొక్కటే కాదు తమ బ్యానర్ లో రూపొందిన ఎన్నో క్లాసిక్స్ ని అదిరిపోయే క్వాలిటీతో గత కొన్నేళ్లుగా అందుబాటులోకి తెస్తూనే ఉన్నారు. వాటి సరసన నువ్వు నాకు నచ్చావ్ చేరింది.

Related Post

కలం కవల్… మన కప్ ఆఫ్ టీ కాదుకలం కవల్… మన కప్ ఆఫ్ టీ కాదు

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన కలం కవల్ కేరళలో సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్ లో వేగంగా రూపొందిన ఈ సైకో థ్రిల్లర్ మూవీ ఫైనల్ రన్ లో 80 కోట్లకు పైగా వసూలు చేయడం ఒక రికార్డు.

Dil Raju and Anand Deverakonda Praise ‘Santhana Prapthirasthu’ TrailerDil Raju and Anand Deverakonda Praise ‘Santhana Prapthirasthu’ Trailer

The trailer of ‘Santhana Prapthirasthu’ was launched in a grand event held in Hyderabad, attended by renowned producer Dil Raju and talented young actor Anand Deverakonda. The film features Vikranth