hyderabadupdates.com Gallery న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు

న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు

న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు post thumbnail image

న్యూఢిల్లీ : న్యాయం గెలిచింది. స‌త్యం బ‌తికే ఉంద‌ని తేలి పోయింది. ఒక‌టా రెండా ఏకంగా 24 ఏళ్ల తర్వాత సంచ‌ల‌నం సృష్టించిన న‌టి ప్ర‌త్యూష కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ఇదిలా ఉండ‌గా సినీ నటి ప్రత్యూష కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కొన్నిఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. 2002 ఫిబ్రవరి 23న తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటనలో సిద్ధార్థ రెడ్డి కొద్ది రోజులకు కోలుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే సిద్ధార్థ రెడ్డి వల్లే తన కూతురు మరణించిందంటూ ప్రత్యూష తల్లి సరోజిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు . ఈ కేసులో సెషన్స్ కోర్టు ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించగా.. హైకోర్టు దాన్ని రెండేళ్లకు కుదించింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సిద్ధార్డ్ రెడ్డి కూడా దానికి కౌంటర్ పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు పరిశీలించిన న్యాయస్థానం గతేడాది నవంబర్ లో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును వెలువరిస్తూ సిద్ధార్డ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. త‌ను నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
The post న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అమ‌రావ‌తిపై విషం క‌క్కుతున్న జ‌గ‌న్ రెడ్డిఅమ‌రావ‌తిపై విషం క‌క్కుతున్న జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై. గురువారం ఎన్డీయే నేత‌ల‌తో అమ‌రావ‌తి బిల్లు ఆమోదం పొందిన సంద‌ర్భంగా టెలికాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోందన్నారు.

విద్యుత్ సంక్షోభం నుంచి నేత‌న్న‌ల‌ను కాపాడాలివిద్యుత్ సంక్షోభం నుంచి నేత‌న్న‌ల‌ను కాపాడాలి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్వీ ర‌మ‌ణతో క‌లిసి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను అసెంబ్లీలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో నేత‌న్న‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏక‌రువు