hyderabadupdates.com movies ‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి మునిగిపోతుంది అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోంది. దీనిని టీడీపీ నేతలు సమర్థంగా తిప్పి కొడుతున్నారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలోనే ఉంటున్నారు. నదీ తీర ప్రాంతంలో ఉన్న ఆయన తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా? అని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ‌ధానిపై ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

న‌దీతీరం వెంబ‌డి సోకాల్డ్ రాజ‌ధానిని క‌డుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రివ‌ర్ బేసిన్‌లో చంద్రబాబు సోకాల్డ్ రాజ‌ధాని క‌డుతున్నారు. అయినా.. అంత భూమి ఎందుకు? ఇంత మంది రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర చర్చకు దారితీశాయి.

2019లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఓ ఇంటిని నిర్మించుకుని గృహ ప్రవేశం చేశారు. తాను అధికారంలో ఉన్న కాలంలో అక్కడ నుంచి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నడిపించారు. 2024 లో ఓటమి పాలైన తర్వాత బెంగళూరులోని యలహంక నివాసంలో ఎక్కువ సమయం గడుపుతూ తాడేపల్లి అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు.

అయితే ఎప్పుడు కూడా వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న దాఖలాలు లేవు. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గుర్తు చేశారు. ఆయన నదీ తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడూ మునిగిపోలేదు కదా.. అని అన్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న మహానగరాల గురించి ఓ వీడియో రూపొందించి బెంగళూరు ప్యాలెస్‌లో ఉండే జగన్‌కి పంపుతానని కూడా ఆయన తెలిపారు.  

మొత్తం మీద రివర్బేసిన్అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం ధీటుగానే సమాధానం ఇస్తోంది. అసలు రివర్బేసిన్కు, రివర్బెడ్కు తేడా కూడా జగన్ కు తెలియదంటూ మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రధాన మంత్రి మోదీ సహకారంతో అమరావతి నిర్మాణానికి చంద్రబాబు కృషి చేస్తుంటే వైసీపీకి చెందిన దానికీ తూట్లు పొడుస్తున్నారని ఎంపీ కలిశెట్టి మండి పడుతున్నారు. మొత్తం మీద నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్మునిగిందా లేదా అనే దానికి వైసీపీ నాయకులే సమాధానం చెప్పాలి.

Related Post

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటేసమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సమ ప్రాధాన్యమిస్తూ.. రోజుల వ్యవధిలో పరిష్కరించేందుకే మొగ్గు

Balakrishna Fires Back at ‘Pogaru’ Talk, Calls Success the Only AnswerBalakrishna Fires Back at ‘Pogaru’ Talk, Calls Success the Only Answer

Veteran actor Nandamuri Balakrishna has once again grabbed headlines with his powerful and unapologetic comments during the blockbuster celebrations of Akhanda 2: Thaandavam. Responding strongly to remarks branding him as

Varanasi: Prithviraj Sukumaran praises Rajamouli’s vision to the skyVaranasi: Prithviraj Sukumaran praises Rajamouli’s vision to the sky

Mollywood superstar Prithviraj Sukumaran’s speech at the Globe Trotter event about numero uno director SS Rajamouli and his ongoing magnum opus, Varanasi, is sure to take the sky-high expectations on