hyderabadupdates.com movies నమ్మొచ్చా… టైటిల్ కోసం 112 కోట్లు

నమ్మొచ్చా… టైటిల్ కోసం 112 కోట్లు

ఇటీవలే విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఓ మోస్తరుగా, తెలుగులో నీరసంగా రన్ అవుతోంది. ఫైనల్ గా ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో తొలి ఫ్లాప్ నమోదు కావడం ఖాయమని బయ్యర్లు చెబుతున్నారు. వరసగా మూడు వంద కోట్ల గ్రాసర్లు ఇచ్చి మరోసారి ఆ ఫీట్ చేస్తాడనుకుంటే ఆ ఛాన్స్ మిస్ కావడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే పోస్ట్ ప్రమోషన్ల కోసం దర్శకుడు విగ్నేష్ శివం చెబుతున్న మాటలు కొన్ని ఆశ్చర్యకరంగా, షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

ఈ సినిమా ముందు రాజ్ కమల్ బ్యానర్ మీద కమల్ హాసన్ నిర్మించేందుకు రెడీ అయ్యారు. కానీ పది నెలలు ప్రాజెక్టులో ఎలాంటి కదలిక లేదు. తర్వాత సెవెన్ స్క్రీన్స్ సంస్థ ముందుకొచ్చింది. తొలుత రెండు వందల కోట్ల బడ్జెట్ అనుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా క్రమంగా దాన్ని తగ్గించుకుంటూ వచ్చి వంద కోట్లలోపే పూర్తి చేశారు. ఓటిటి మార్కెట్ హఠాత్తుగా పడిపోవడంతో నిర్మాతకు ఫైనాన్స్ తేవడం కూడా ఒకదశలో కష్టమైపోయింది. విగ్నేష్ భార్య నయనతార డబ్బు సర్దుబాటు చేసింది.

ఇక టైటిల్ గురించి చెబుతూ ముందు ఎల్ఐసీ అని పెడదామనుకుని అనుమతి అడిగితే వాళ్ళు ఏకంగా 112 కోట్లు డిమాండ్ చేయడంతో వెనక్కు తగ్గి ఎల్ఐకె ఆప్షన్ ఎంచుకున్నానని అన్నారు. అంత డబ్బు లేకపోవడంతో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇలా ఒక సినిమాకు తమ పేరు పెట్టుకోవడానికి అంత డిమాండ్ చేసిందానేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తే బెటర్.

ఇదంతా ఎలా ఉన్నా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిదు రోజులకు గాను సుమారు నలభై కోట్ల దాకా వసూలు చేసి డీసెంట్ అనిపించుకుంది. అది కూడా ప్రదీప్ రంగనాథన్ ఇమేజ్ వల్ల తప్పించి మరొకటి కాదు. విగ్నేష్ శివన్ దర్శకత్వం మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. 2040 బ్యాక్ డ్రాప్ తో ఇంత సాగదీసిన టెక్నికల్ లవ్ స్టోరీ ఎందుకు చెప్పాడని విమర్శకులు తలంటారు. తెలుగు వర్షన్ మాత్రం అనుకున్న దానికన్నా త్వరగా వాషౌట్ అయిపోయేలా ఉంది.  

Related Post

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారుఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్ వస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టీజర్ లాంటిది వదిలితే సోషల్ మీడియా షేక్ అయిపోతుందని వాళ్ళ నమ్మకం.

కావూరి సాంబ‌శివ‌రావు మృతి.. తెలుసుకోవాల్సింది ఏంటంటే!కావూరి సాంబ‌శివ‌రావు మృతి.. తెలుసుకోవాల్సింది ఏంటంటే!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబ‌శివ‌రావు.. బుధ‌వారం ఉద‌యం మృతి చెందారు. గ‌త కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ.. క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 82 సంవ‌త్స‌రాలు. కాంగ్రెస్ పార్టీతోనే

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లిమల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి ఇంకా పాపులర్. పాలమ్మినా..పూలమ్మినా అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత తన మార్క్ డైలాగులతో,