hyderabadupdates.com Gallery న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి post thumbnail image

న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మున్సిప‌ల్ , మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున విజ‌యాన్ని చేకూర్చి పెట్టార‌ని అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలో ఆక‌స్మిక త‌నికీ చేశారు. క‌మిష‌న‌ర్ తో క‌లిసి ప‌ట్ట‌ణంలో ప‌రిశీలించారు. ప్రజల సహకారంతో నల్గొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే త‌న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుం చే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రకాశం బజార్, లతీఫ్ షాప్ గుట్ట తదితర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు.
ప్రకాశం బజార్‌కు ప్రతిరోజూ సుమారు 10,000 మంది ప్రజలు వస్తుంటారని అన్నారు మంత్రి. పెరుగుతున్న జనాభా, వ్యాపారాలకు అనుగుణంగా ఇక్కడి రహదారులు లేక పోవడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న పూలు, పండ్లు, చిన్న వ్యాపారాలను పాత కలెక్టరేట్ కార్యాలయ స్థలానికి తరలించాలని అధికారుల‌ను ఆదేశించారు మంత్రి. ఏ ఒక్క చిన్న వ్యాపారికి అన్యాయం జరగకుండా, వారి ఉపాధి దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులతో స‌మీక్ష చేప‌ట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భూగర్భ విద్యుత్ వ్యవస్థ (Underground Cabling) ఏర్పాటు చేస్తామ‌న్నారు.
పటిష్టమైన సిసి రోడ్ల నిర్మాణం చేప‌డ‌తామ‌న్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.
The post న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’

Rolex : రోలెక్స్‌… ఈ పేరు చాలా ఫేమస్‌. విక్రమ్ సినిమా ఎండ్ టైటిట్ కార్డు పడేటప్పుడు… ఆ సినిమా సీక్వెల్ కు హింట్ ఇస్తూ… రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఈ రోలెక్స్ (Rolex)

CJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహంCJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహం

    కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని

డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్

అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు