hyderabadupdates.com movies న‌వీన్ యాద‌వ్‌కు మంత్రి ప‌ద‌వి.. తీవ్ర క‌స‌ర‌త్తు?

న‌వీన్ యాద‌వ్‌కు మంత్రి ప‌ద‌వి.. తీవ్ర క‌స‌ర‌త్తు?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో భారీ మెజారిటీ ద‌క్కించుకుని విజ‌యం సాధించిన న‌వీన్ యాద‌వ్‌కు మంత్ర వ‌ర్గంలో చోటు ల‌భించ‌నుందా? ఆ దిశ‌గా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న చేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు కాంగ్రెస్ పార్టీనాయ‌కులు. ఇది అతిశ‌యోక్తి కాద‌ని కూడా చెబుతున్నారు. ప్ర‌స్తుతం జూబ్లీ విజ‌యంతో కాంగ్రెస్ జోష్ పెరిగింది. ఈ క్ర‌మంలోనే బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన న‌వీన్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా ప‌రోక్షంగా మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను ఆశించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

బీఆర్ఎస్‌కు హైద‌రాబాద్‌లో బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. అదేవిధంగాఓటు బ్యాంకు కూడా ఉంది. 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ లో బీఆర్ఎస్ ప‌ట్టు పెంచుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప‌ట్టు కోల్పోయినా.. భాగ్య‌న‌గ‌రంలో దూకుడు పెంచింది. ఫ‌లితంగా హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ ప‌ల్టీలు కొట్టింది. దీని నుంచి తాజాగా జూబ్లీహిల్స్ హ‌స్తం పార్టీకి పరువు కాపాడింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల నాటికి మ‌రింత ప‌ట్టు పెంచేందుకు న‌వీన్ యాద‌వ్‌కు మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించ‌డం స‌రైన చ‌ర్య అవుతుంద‌న్న ఆలోచ‌న చేస్తున్నారు.

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బీసీల‌కు పెద్ద పీట వేస్తామ‌ని చెబుతున్న నేప‌థ్యంలో న‌వీన్ యాద‌వ్‌కు ఆ దిశ‌గా మంత్రివ‌ర్గంలో చోటు ఇస్తే.. అది బీసీ సామాజిక వ‌ర్గంలో కాంగ్రెస్‌కు ఉన్న సానుభూతిని పెంచు తుంద‌న్న ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్టు తెలిసింది. ఇదే స‌మ‌యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చే వ్య‌వ‌హారం ఇంకా కొలిక్కి రాలేదు. దీనిపై ఆయా వ‌ర్గాల్లో ఆశ‌లు కూడా నెల‌కొన్నాయి.

దీంతో ఈ వ్య‌వ‌హారం నుంచి అంతో ఇంతో ఉప‌శ‌మ‌నం పొందేందుకు కూడా న‌వీన్ యాద‌వ్ క‌లిసి వ‌స్తా ర‌న్న ఆలోచ‌న కూడా క‌నిపిస్తోంది. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన న‌వీన్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వా రా.. బీసీల రిజ‌ర్వేష‌న్‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్న సీఎం రేవంత్ వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరుతుంద న్న లెక్క‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం మంత్రి వ‌ర్గంలో మ‌రో రెండు సీట్ల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ నెల 17(సోమ‌వారం)న జ‌రిగే కీల‌క స‌మావేశంలో ఈ విష‌యంపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

Related Post