hyderabadupdates.com movies నాగశౌర్య అందుకే హడావిడి చేయలేదు

నాగశౌర్య అందుకే హడావిడి చేయలేదు

ఇవాళ రిలీజైన కొత్త సినిమాల్లో అందరి దృష్టి తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ మీద ఉంది కానీ బ్యాడ్ బాయ్ కార్తీక్ కూడా విడుదలైన సంగతి చాలా మంది ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. కారణం ప్రమోషన్లు లేకపోవడమే. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, రెండు ప్రెస్ ఇంటర్వ్యూలు ఇచ్చేసి మమ అనిపించారు తప్ప ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఏదైనా చేయాలనే తాపత్రయం కనిపించలేదు. నిర్మాత ఎన్ఆర్ఐ కావడంతో ఇక్కడ మార్కెటింగ్ వ్యవహారాలను సీరియస్ గా పట్టించుకోలేదు.

సరే పబ్లిసిటీ సంగతి పక్కనపెడితే బ్యాడ్ బాయ్ కార్తీక్ పేరుకు తగ్గట్టే టాక్ చాలా తేడాగా వినిపిస్తోంది. రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ ఏ మాత్రం ఆసక్తి గొలిపేలా తీయలేకపోయారని పబ్లిక్ టాక్, రివ్యూస్ తేల్చేస్తున్నాయి. నిజానికి నాగశౌర్య మార్కెట్ డెడ్ కాలేదు. ఇమేజ్ పోలేదు. సరైన సినిమా వస్తే థియేటర్ కు వచ్చే ఆడియన్స్ ఉన్నారు. ఎటొచ్చి అలాంటి కంటెంట్ పడటం లేదు. ఇప్పుడీ బ్యాడ్ బాయ్ చూస్తేనేమో గుడ్ అనిపించే లక్షణాలు కనిపించడం లేదు.

ఒకపక్క మండిపోతున్న ఎండలు, ఇంకోవైపు ప్రచారంతో హోరెత్తిస్తున్న చిన్న సినిమాలు, ఇవి చాలవన్నట్టు ఐపీఎల్ క్రికెట్ దెబ్బ. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు ప్లానింగ్ కరెక్ట్ గా ఉండాలి. బ్యాడ్ బాయ్ కార్తీక్ కు చాలా చోట్ల కనీస ఆక్యుపెన్సీలు నమోదు కాలేదు. పడిన షోలలో కూడా నామ మాత్రంగా జనం ఉన్నారు. హారిస్ జైరాజ్ సంగీతం,ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి పాత్ర లాంటి ఎలిమెంట్స్ ఏ కోశానా జనంలో ఇంటరెస్ట్ పుట్టించలేకపోయాయి.

ఇదంతా ముందే ఊహించే నాగశౌర్య ఈ సినిమా విషయంలో ఆంటీ అంటనట్టు ఉన్నాడని అనుకోవాలి. రంగబలి డిజాస్టర్ తర్వాత తనకు చాలా గ్యాప్ వచ్చేసింది. అసలు ఛలో తర్వాత ఆ స్థాయి విజయం మళ్ళీ దక్కనే లేదు. కష్టపడుతున్నాడు, అన్ని జానర్లు ట్రై చేస్తున్నాడు కానీ ఫలితం మాత్రం రిపీట్ అవుతూనే ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సరైన కథల ఎంపిక, దర్శకుడి సెలక్షన్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మళ్ళీ కంబ్యాక్ అవ్వొచ్చు.

Related Post

నాగ్ ఫ్యామిలీ మెంబర్ డిజిటల్ అరెస్ట్నాగ్ ఫ్యామిలీ మెంబర్ డిజిటల్ అరెస్ట్

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మను నడిపిస్తున్న ఇమ్మడి రవి అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పైరసీని అరికట్టడంలో ఇది పెద్ద బ్రేక్ త్రూగా ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, దర్శక

షాకింగ్… బాహుబలి 2ని దాటేసిన దురంధర్షాకింగ్… బాహుబలి 2ని దాటేసిన దురంధర్

చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు పెట్టింది. నార్త్ అమెరికాలో ఇప్పటిదాకా దీని పేరు మీదున్న 20.7 మిలియన్ డాలర్ల మార్కుని దురంధర్ దాటేసింది.  21 మిలియన్లతో