ప్రతిపక్షంలోకి వెళ్లాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాటతీరు, వ్యవహార శైలి ఎలా తయారయ్యిందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నపుడూ ఆయన తడబడే వారు కానీ.. ప్రతిపక్షంలోకి వెళ్లాక తడబాటు మరింత ఎక్కువైంది. ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా.. లేదా బయట ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినా.. ట్రోల్స్‌కు కావాల్సిన మెటీరియల్ ఇచ్చేస్తున్నారు.
జగన్ వస్తున్నాడంటే మీమ్ మెటీరియల్ ఇస్తాడు రెడీగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. తాజాగా లడ్డు కల్తీ వ్యవహారం మీద జగన్ చేసిన కామెంట్.. మీమర్స్‌కు కంటెంట్ ఇచ్చేసింది. లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ జరిపిన దర్యాప్తు సంస్థలు నెయ్యిలో జంతు కొవ్వులు లేవని నిర్ధరించాయన్నది వైసీపీ వెర్షన్.
ఇదే విషయాన్ని చెప్పబోతూ జగన్ తడబడ్డారు. నెయ్యిలో నాన్ వెజ్ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. సరైన పదం దొరక్క ఆయన ఆ మాట వాడేశారు. తర్వాత సర్దుకుని జంతు కొవ్వులు అన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద పార్టీ అధినేతగా ఉంటూ.. ఇలా పదాల కోసం తడుముకోవడం.. నాన్ వెజ్ అనే పదం వాడడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇలా మాటల తడబాటుతో జగన్ గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇప్పుడు భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశఃలో ఇలాంటి కామెంట్ చేయడంతో మరింతగా విమర్శల పాలవుతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి. మరోవైపు నేషనల్ మీడియా లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్ గాలి బాగానే తీస్తోంది.