hyderabadupdates.com movies నాయకుడు తప్పుకుంటే ‘రాజా సాబ్’కు పండగే

నాయకుడు తప్పుకుంటే ‘రాజా సాబ్’కు పండగే

రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా ప్రకటించబడిన జన నాయకుడు జనవరి 9 విడుదలను ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై వర్గాలు ఇప్పుడీ డేట్ కి రావడం అనుమానమేనని చెబుతున్నాయి. ఇటీవలే జరిగిన కరూర్ దుర్ఘటనలో తన పార్టీ మీటింగ్ వల్ల నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విజయ్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లో నెట్టేసింది. ఈ సభకు బాధ్యులైన వారి మీద కేసులు నమోదయ్యాయి కానీ ఇంకా అందరూ దొరకలేదు. పైగా వాళ్ళు కీలక వ్యక్తులు కావడంతో పొలిటికల్ మూమెంట్స్ ని ప్లాన్ చేసుకోవడానికి విజయ్ కు సరైన సహాయం లేకుండా పోయిందని ఇన్ సైడ్ టాక్.

ఈ ఒత్తిడిలో ఇప్పుడు సినిమా రిలీజ్, ప్రమోషన్లంటూ హడావిడి చేస్తే మీడియాతో పాటు జనం వైపు నుంచి విమర్శలు ఎదురుకునే ప్రమాదం ఉండటంతో జన నాయకుడు వాయిదా వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సీరియస్ గానే చేస్తున్నారట. నిర్మాణ సంస్థ ప్రస్తుతానికి పాత తేదీకే కట్టుబడి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తోంది. నిజంగా జన నాయకుడు బరిలో నుంచి తప్పుకుంటే రాజా సాబ్ కు పండగే. ఎందుకంటే తమిళనాడు, కేరళలో విజయ్ కున్న ఫాలోయింగ్ దృష్ట్యా రాజా సాబ్ కు ఓపెనింగ్స్ పరంగా పెద్ద సమస్య అయ్యేది. కానీ ఇప్పుడు సోలో రిలీజ్ దక్కితే మతిపోయే బాక్సాఫీస్ నెంబర్లు కళ్లజూడవచ్చు.

ప్రస్తుతానికి ఇదేదీ కన్ఫర్మ్ కాదు కాబట్టి అఫీషియల్ అయ్యేదాకా వేచి చూడాలి. జన నాయకుడు తప్పుకుంటే రాజా సాబ్ తో పాటు శివకార్తికేయన్ పరాశక్తి కూడా విపరీతంగా లాభ పడుతుంది. పండగ సీజన్ కావడం వల్ల విజయ్ రేస్ లో లేకపోతే కొన్ని పదుల కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతుంది. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన జన నాయకుడులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా బాబీ డియోల్ విలన్ గా నటించాడు. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద మంచి అంచనాలున్నాయి. ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చూడాలి మరి జన నాయకుడు మాట మీద ఉంటాడో లేక రూటు మారుస్తాడో.

Related Post

రాజ్ కుమార్ అంటే పేరు కాదు… ఫైర్ !రాజ్ కుమార్ అంటే పేరు కాదు… ఫైర్ !

ఇప్పటి తరంలో శివరాజ్ కుమార్, రాజ్ కపూర్, డాక్టర్ రాజ్ కుమార్ లాంటోళ్ళు గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటారు కానీ బాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన రాజ్ కుమార్ గురించి కూడా