hyderabadupdates.com movies నాయ‌కుల‌కు మ‌రింత ఫ్రీడ‌మ్‌… రీజనిదే!

నాయ‌కుల‌కు మ‌రింత ఫ్రీడ‌మ్‌… రీజనిదే!

ప్రస్తుతం రాష్ట్రంలో అనేక మంది నాయకులు ఉన్నారు. అయితే ఎవరి అవకాశం ఎవరి అనుకూలతను బట్టి వారు రాజకీయాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. గత ఎన్నికలకు ముందు అనేకమంది నాయకులు తమకు నచ్చిన పార్టీలను ఎంచుకున్నారు. పార్టీలు మారారు. గెలిచిన వారు గెలిచారు ఓడిన వారు ఓడారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో నాటికి ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. నాయకులకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఎందుకంటే సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో నాయకుల అవసరం పార్టీలకు పార్టీల అవసరం నాయకులకు ఉంటుంది. కాబట్టి ఈ అభినాభావ సంబంధాన్ని ఇరుపక్షాలు ఏ విధంగా ఉపయోగించుకుంటాయనే దాన్నిబట్టి రాజకీయాలు మారతాయి. గత ఎన్నికలను చూస్తే టికెట్లు కోసమే చాలా మంది నాయకులు పార్టీలు మారారు. అదేవిధంగా గెలుపుగుర్రాలు అనుకున్న వారిని కొంతమందిని ఎంపిక చేసి మరీ పార్టీలు కూడా ఆహ్వానించాయి.

ఇప్పుడు మరింత స్వేచ్ఛ నాయకులకు లభించనుంది. ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి తమకు అనుకూలంగా ఉన్న పార్టీలు లేదా తమకు అనుకూలంగా ఉన్న వర్గాలకు చేరువ అయ్యేందుకు నాయకులకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది అన్నది వాస్తవం. అందుకే ఇప్పుడు రాజకీయంగా నాయకులకు మరింత స్వేచ్ఛ లభించే అవకాశం ఏర్పడింది. నిజానికి నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయాలను బలోపేతం చేస్తుంది అనడంలో సందేహం లేదు.

కానీ నాయకులకు మితిమీరిన స్వేచ్ఛ ఇస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. గతంలో 2009 అంతకు ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ఇలాంటి పరిణామాల్ని తీసుకొచ్చింది. అనేకమంది నాయకులు పార్టీలు మారారు.. స్వేచ్ఛగా వ్యవహరించారు. వ్యక్తిగతంగా వారికి ఎలాంటి లబ్ధి చేకూరింద‌నేది పక్కన పెడితే రాజకీయంగా అనేక అవకాశాలు వచ్చాయి అన్నది వాస్తవం. మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా లేకపోతే నాయకులు ఒక నిబద్ధతకు లోబడి పార్టీలోనే ఉంటారా అనేది చూడాలి.

ఏదేమైనా ప్రస్తుతం ఏర్పడిన అవకాశాన్ని నాయకులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అనడంలో సందేహం లేదు. దీంతో భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Related Post

7 New Telugu and Tamil Movies Releasing This Week: From Vaa Vaathiyaar to Psych Siddhartha7 New Telugu and Tamil Movies Releasing This Week: From Vaa Vaathiyaar to Psych Siddhartha

Cast: Vemal, Srushti Dange, Yogi Babu, Kabir Duhan Singh Director: Dhinesh Kalaiselvan Language: Tamil (also in Hindi, Telugu, Kannada, Malayalam) Genre: Adventure Mythological Thriller Release date: December 12, 2025 A