hyderabadupdates.com movies నారా లోకేష్‌ గ్రాఫ్: పేప‌ర్ క‌టింగ్ సేక‌రించిన మోడీ టీమ్?

నారా లోకేష్‌ గ్రాఫ్: పేప‌ర్ క‌టింగ్ సేక‌రించిన మోడీ టీమ్?

అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయి రాజ‌కీయాల్లో నారా లోకేష్ గ్రాఫ్ పుంజుకుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా ఆయ‌న బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వెళ్లిన‌ప్పుడు.. జాతీయ మీడియా ఆయ‌న కోసం వేచి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామం అసాధార‌ణం. ఎంతో ఇమేజ్ ఉంటే త‌ప్ప‌.. జాతీయ మీడియా.. అందునా.. ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో వేచి ఉండ‌డం అరుదుగానే సంభ‌విస్తుంది.

దీనిని బ‌ట్టి జాతీయ స్థాయిలో నారా లోకేష్‌కు ఇమేజ్ పెరిగింద‌న్న వాద‌న పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వెళ్లిన లోకేష్‌కు మ‌రో అనుభ‌వం కూడా ఎదురైంది. కొంద‌రు బీజేపీ జాతీయ నాయ‌కులు ఆయ‌న‌తో చ‌ర్చించేందుకు.. క్యూ క‌ట్టారు. కొంద‌రైతే.. ఆయ‌న‌ను త‌మ ఇళ్ల‌కు ఆహ్వానించారు. కానీ, బిజీ షెడ్యూల్ నేప‌థ్యంలో లోకేష్ ఎవ‌రి ఇంటికీ వెళ్ల‌లేదు. దీంతో వారివారి కుటుంబాల‌ను పార్టీ కార్యాల‌యాల‌కు పిలిచి సెల్ఫీలు తీసుకున్నారు.

మ‌రోవైపు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి చెందిన రాజ‌కీయ ప‌రిశీల‌కుల బృందం ప్ర‌త్యేకంగా ఉంది. ఇది ఢిల్లీ కేంద్రంగా ప‌నిచేస్తూ.. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డెక్క‌డ ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతున్నాయో నిశితంగా గ‌మ‌నిస్తుంది. ఈ క‌మిటీ కూడా.. తాజాగా బీహార్ లో నారా లోకేష్‌.. చేసిన ప్రసంగాలు, మీడియా చిట్‌చాట్‌ల‌కు సంబంధించిన నివేదిక‌ను సిద్ధం చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిని ప్ర‌ధానికి అందించ‌నున్నారు.

ఇలా.. ఎంతో ప్ర‌భావం చూపించే నాయ‌కుల విష‌యంలో మాత్ర‌మే స్పందించి, నివేదిక‌లు సిద్ధం చేసే పీఎంవో పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ.. నారా లోకేష్ చేసిన ప్ర‌సంగాల‌కు సంబంధించి పేప‌ర్ల లో వ‌చ్చిన(జాతీయ మీడియా) క‌టింగ్స్‌ను కూడా సేక‌రించింది. సో.. ఈ ప‌రిణామాల‌తో జాతీయ‌స్థాయిలో నారా లోకేష్ ఎలివేష‌న్ జోరుగా సాగుతోంద‌ని పార్టీ ఎంపీలు చెబుతున్నారు. ఇక‌, రాష్ట్ర స్థాయిలో నాయ‌కుల‌కు కూడా నారా లోకేష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆద‌ర్శంగా మారితే.. ఇప్పుడు దాంతో పాటు.. క్ర‌మ‌శిక్ష‌ణ ప‌రంగా కూడా ఆయ‌న ఐకాన్ అయ్యారు.

Related Post

దుబాయ్ తేజస్ ప్రమాదం.. ఎవరీ నమాంశ్‌ స్యాల్?దుబాయ్ తేజస్ ప్రమాదం.. ఎవరీ నమాంశ్‌ స్యాల్?

దుబాయ్ ఎయిర్ షోలో ఊహించని విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత్ గర్వంగా ప్రదర్శించిన ‘తేజస్’ యుద్ధ విమానం విన్యాసాలు చేస్తూ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం

ఈ ఫోటోని ఇప్పుడు ఎందుకు వదిలేరు?ఈ ఫోటోని ఇప్పుడు ఎందుకు వదిలేరు?

ప్ర‌స్తుతం ఏదీ దాగ‌దు.. సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ పుల్‌గా ఉంది.. ప్ర‌ధాన మీడియా అయితే.. విస్తృతంగా ఉంద‌ని చెప్పుకొంటాం క‌దా!. కానీ.. కొన్ని కొన్ని కీల‌క విష‌యాలు ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రు బ‌య‌ట పెడితే త‌ప్ప తెలియ‌డం లేదు. తాజాగా ఇలాంటి

కాలనీలో చిక్కుకున్న అల్లరోడి ఆల్కహాల్కాలనీలో చిక్కుకున్న అల్లరోడి ఆల్కహాల్

క్రైమ్ థ్రిల్లర్ చేస్తే కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో 12ఏ రైల్వేకాలనీలో నటించిన అల్లరి నరేష్ కు పెద్ద డిజాస్టరే మిగిలింది. రెండో వారానికే వాషౌట్ కావడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఆ ఒక్కటి అడక్కు లాగా కామెడీ చూపిస్తే జనాలు