hyderabadupdates.com movies నారా వారి ఇంటో ఫంక్షన్ ఇంతా సింపుల్‌గానా..

నారా వారి ఇంటో ఫంక్షన్ ఇంతా సింపుల్‌గానా..

నారా వారి ఇంటో ఫంక్షన్ ఇంతా సింపుల్‌గానా.. post thumbnail image

ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా హాజరైంది. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో ముందుండే నారా, నందమూరి కుటుంబాలు నారా లోకేష్, బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించాయి. ఈ నెల 21వ తేదీకి నారా దేవాన్ష్ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుక నిర్వహించినట్టు తెలుస్తోంది.

“తాతల మురిపెం.. అమ్మమ్మ, నాన్నమ్మల ఆశీస్సులు.. అమ్మానాన్నల ప్రేమ.. మేనమామ ఆత్మీయత.. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది” అని సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా దేవాన్ష్ కు నూతన వస్త్రాలు బహుకరించారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగాలని ఆకాంక్షిస్తూ దేవాన్ష్ ను సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు.

ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సహా పలువురు పాల్గొన్నారు. 2015 మార్చి 21న దేవాన్ష్ జన్మించాడు. ప్రస్తుతం విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న ఆయన ప్రపంచ చెస్ లో పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

కాగా, ఈ వేడుకలతో పాటు శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ వేడుకలు కూడా జరగడం విశేషం.

Related Post

4 Malayalam and Tamil Films to Watch on OTT This Week: Shane Nigam’s Balti to Kavin starrer Mask4 Malayalam and Tamil Films to Watch on OTT This Week: Shane Nigam’s Balti to Kavin starrer Mask

Cast: Kavin, Andrea Jeremiah, Ruhani Sharma, Charle, Achyuth Kumar, Archana Chandhoke, George Maryan, Aadukalam Naren, Subramaniam Siva, Kalloori Vinoth Director: Vikarnan Ashok Genre: Neo-noir Action Thriller Runtime: 2 hours and

మంచి స్పీడు మీదున్న మురారిమంచి స్పీడు మీదున్న మురారి

పది రోజుల కిందట పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైంది ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి రేసులో చివరగా బరిలోకి దిగిన ఈ చిత్రం గురించి రిలీజ్ ముంగిట పెద్దగా డిస్కషనే లేదు. ఇంత పోటీలో ఈ సినిమాను ఎందుకు రిలీజ్