hyderabadupdates.com Gallery నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌ post thumbnail image

అనంత‌పురం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు నీటి భ‌ద్ర‌త గురించి. సోమ‌వారం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘#జలధార’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు భరోసా కల్పించేలా జలధార కార్యక్రమాన్ని రూపొందించాం అన్నారు. నీటి సంరక్షణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించాం అని అన్నారు సీఎం. 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యుల సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 2024లో అనంతపురం జిల్లాలో 13.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు సమర్థ నీటి నిర్వహణ ద్వారా 2.11 మీటర్ల మేర పెరిగింద‌ని, నేడు 11.25 మీటర్లకు చేరుకున్నాయని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
నీరు ఉంటేనే అభివృద్ధి, పరిశ్రమలు, సంక్షేమం-సంపద వ‌స్తుంద‌న్నారు. ఒకప్పుడు ఎడారిగా మారుతుంది అని అంతా భయపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా నేడు నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలతోనే ఉద్యాన రంగంలో అగ్రగామిగా ఉందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సాగునీటి సంఘాలు కలిసి అడుగేసి రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెంపుతో రికార్డులు సృష్టించాలని పిలుపునిచ్చారు. నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టమ‌ని ప్ర‌క‌టించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పని చేస్తున్నాం అని చెప్పారు.
The post నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మార్చిలో దుమ్ము రేప‌నున్న య‌ష్ టాక్సిక్మార్చిలో దుమ్ము రేప‌నున్న య‌ష్ టాక్సిక్

బెంగ‌ళూరు : ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు గీతు మోహ‌న్ దాస్ తీసిన మూవీ టాక్సిక్. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక య‌ష్ త‌న సినీ కెరీర్ లో ఇది మ‌రిచి పోలేని సినిమాగా ఉండ‌బోతోంద‌ని పేర్కొన్నాడు. భారీ ఖ‌ర్చుతో

Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌

    పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్‌ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల

Amit Shah: చొరబాటుదారుల కారిడార్ నిర్మించడమే ప్రతిపక్షాల లక్ష్యం – అమిత్‌షాAmit Shah: చొరబాటుదారుల కారిడార్ నిర్మించడమే ప్రతిపక్షాల లక్ష్యం – అమిత్‌షా

    బిహార్‌లో ప్రధాని మోదీ పారిశ్రామిక నడవా నిర్మించాలని అనుకుంటుంటే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మాత్రం చొరబాటుదారుల కారిడార్‌ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాసారాం, అర్వల్‌ పట్టణాల్లో