hyderabadupdates.com Gallery నూత‌న హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి సీజేఐ శంకుస్థాప‌న‌

నూత‌న హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి సీజేఐ శంకుస్థాప‌న‌

నూత‌న హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి సీజేఐ శంకుస్థాప‌న‌ post thumbnail image

హైద‌రాబాద్ : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం ఎ. రేవంత్ రెడ్డి తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు, న్యాయ‌మూర్తులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రస్థానం లో ఈ రోజు ప్రత్యేకం. దేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉన్న ఈ సందర్భం అరుదైన అవకాశం, గౌరవం అని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు సీఎం . ఒక కోర్టు సముదాయం నిర్మించడం, న్యాయం కోసం ఒక ప్రాంగణం సృష్టించడం, కుల మతాలకు అతీతంగా ప్రజల కోసం ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లే తాను భావిస్తానని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు చివరి ఆశ, నమ్మకం న్యాయస్థానం. అటువంటి న్యాయస్థానాన్ని నిర్మించే అవకాశం త‌మ‌ ప్రభుత్వానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని అన్నారు.
ఈ కొత్త హైకోర్టు ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా నిలబడుతుందని, ఇది న్యాయం కోసం వచ్చే పేదలు, బలహీనులకు భరోసా ఇస్తుందని విశ్వసిస్తున్నానని తెలిపారు సీఎం. ఈ భవన సముదాయాన్ని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని ప్ర‌క‌టించారు . ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్.వి. భట్టి, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post నూత‌న హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి సీజేఐ శంకుస్థాప‌న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్

    నేను ఉప ముఖ్యమంత్రిగానో… ఎమ్మెల్యేగానో… ఉప్పాడకు రాలేదు. ఓ మత్స్యకారుడి బాధను అర్థం చేసుకోవడానికి వారి ఇంట్లోని సభ్యుడిగా… వారిలో ఒకడిగా వచ్చాను. నాకు మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసి… ఇక్కడికి వచ్చానని

మార్చి 1న తమిళనాడుకు ప్రధాని మోదీమార్చి 1న తమిళనాడుకు ప్రధాని మోదీ

త‌మిళ‌నాడు : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ త‌మిళ‌నాడులో ప‌ర్యటించ‌నున్నారు. మార్చి 1వ తేదీన అధికారికంగా జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన రాత్రికి చెన్నైకి చేరుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన

ఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీ

దావోస్ : దావోస్ లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు 2026లో పాల్గొన్నారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు, తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి