hyderabadupdates.com movies నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా తీశారేమో అనిపిస్తుంది. మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నిడివి అంటే యానిమల్ రేంజ్ లో ఉంటాయేమోననే అంచనాలు నెలకొన్నాయి. ఇంతా చేసి విడుదల మరికొద్ది గంటల్లో ఉందనగా దురంధర్ మీద నెగటివిటీ పెరిగిపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోగా పాటలు, ట్రైలర్లు బజ్ పరంగా జనంలో ఆసక్తి పెంచలేకపోయిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఓపెనింగ్స్ మీద బోలెడు అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్న తలెత్తడం సహజం. రణ్వీర్ సింగ్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి రెండేళ్లు దాటింది. ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ వేగంగా సినిమాలు చేయకపోవడం వల్ల ఆడియన్స్ తో కనెక్టివిటీ క్రమంగా తగ్గుతూ పోయింది. దీంతో పాటు యానిమల్ ని స్ఫూర్తిగా తీసుకున్నట్టు అదే తరహా యాక్షన్ బ్లాక్స్, వయొలెన్స్ పెట్టడం ఇంకొంచెం డ్యామేజ్ చేసింది. దర్శకుడు ఆదిత్య దార్ ఏడేళ్ల క్రితం యురి లాంటి అల్టిమేట్ మూవీ ఇచ్చాక చేసిన సినిమా ఇది. అలాంటప్పుడు హైప్ ఇంకా ఎక్కువగా ఉండాలి. దానికి భిన్నంగా ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మద్దతు దక్కపోవడం విచిత్రమే.

ఇంకో ట్విస్టు ఏంటంటే ముందు రోజు సాయంత్రమే మీడియాకు స్పెషల్ ప్రీమియర్ సిద్ధం చేసి ఆ మేరకు ఆహ్వానాలు కూడా పంపించారు. సెలబ్రిటీలకు ఒక షో పెట్టారు. ఉన్నట్టుండి వాటిని రద్దు చేయడం అనుమానాలను మరింత పెంచింది. కంటెంట్ గురించి భయపడో లేదా లీక్స్ వెళ్లిపోతాయనే డౌట్ ఏమో కానీ మొత్తానికి ఇది కూడా హాట్ టాపిక్ గా మారింది. మాఫియా, ఉగ్రవాదం, తీవ్రవాదం అన్నీ మిక్స్ చేసిన దురంధర్ కు నిడివే అతి పెద్ద శాపంగా మారనుందని బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు. రేపు టాక్ యూనానిమస్ గా వస్తే ఓకే. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు.

Related Post

రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ కు ఉంటారా? గంభీర్ స్ట్రెయిట్ ఆన్సర్!రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ కు ఉంటారా? గంభీర్ స్ట్రెయిట్ ఆన్సర్!

మొత్తానికి చాలా కాలం తరువాత టీమిండియా టెస్ట్ సీరీస్ లో క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలవడంతో కోచ్ గంభీర్ మరోసారి హైలెట్ అయ్యాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న

Aadi Sai Kumar’s Mystical Thriller Shambhala to Release on December 25Aadi Sai Kumar’s Mystical Thriller Shambhala to Release on December 25

The much-awaited supernatural thriller Shambhala: A Mystical World, starring Aadi Sai Kumar, is all set for a grand theatrical release on December 25, during the Christmas holidays. The film has

ఛాలెంజ్ కోసం 10 వేల క్యాలరీల ఆహారం తీసుకుని…ఛాలెంజ్ కోసం 10 వేల క్యాలరీల ఆహారం తీసుకుని…

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చి, ఫాలోవర్లను పెంచుకోవాలనే తాపత్రయం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. రష్యాకు చెందిన 30 ఏళ్ల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ దిమిత్రి నుయాంజిన్ విషయంలో అదే జరిగింది. తన క్లయింట్స్ కోసం ఒక వెరైటీ ఎక్స్‌పెరిమెంట్ చేయబోయి,